telangana
రేపు హైదరాబాద్‌కు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ సందీప్..
హైదరాబాద్, నవంబర్ 21: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ (ఏఐసీసీ) సందీప్ ఆదివారం హైదరాబాద్‌కు రానున్నారు. రాష్ట్రంలో పార్టీ సంస్థాగత బలోపేతం, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు ఆయన ఆదివారం రోజంతా గాంధీభవన్‌లో వరుసగా పలు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు.
షెడ్యూల్ ప్రకారం ఆదివారం ఉదయం 11 గంటలకు టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ), అడ్వైజరీ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, ప్రతినిధులతో సందీప్ ప్రత్యేకంగా భేటీ అవుతారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు (డీసీసీ), ఇతర ముఖ్య నేతలు పాల్గొననున్నారు. ఈ వరుస భేటీల్లో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై కీలక దిశానిర్దేశం చేయనున్నారు.