BREAKING
అంబేద్కర్ అవార్డు గ్రహీత ఎర్పుల ఆనంద్ కు ఘనంగా సన్మానం నిజామాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర రద్దు.. అంబేద్కర్ అవార్డు గ్రహీత ఎర్పుల ఆనంద్ కు ఘనంగా సన్మానం సేవే లక్ష్యం గ్రామ అభివృద్దే నా ధ్యేయం శంకరాపురం సర్పంచ్ టిడిపి అభ్యర్థి పూర్ణచంద్రరావు సాగునీరు అందించి పంటలు కాపాడండి. ఆర్ కృష్ణాపురం రైతుల వినతి అనంతపురం మేయర్‌గా రమేష్ గౌడ్ ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్.. అట్టహాసంగా ఏర్పాట్లు ప్రతి ఇంటికి ఓటర్ స్లిప్పులు అందాలి అర్హులైన వారికి కొత్త పింఛన్లు : సర్పంచ్ ఈగ ప్రభాకర్ రెడ్డి నేనెవరినీ బ్లాక్ మెయిల్ చేయడం లేదు..హై కమాండ్ చెప్పినట్టు నడుచుకుంటా .. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన సర్పంచ్ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం - అర్హులైన రేషన్ కార్డు లబ్ధిదారులకు జీవిత బీమా కల్పన అంకత్‌పల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం యువతకు ఉపాధి అవకాశాలతో పాటు స్వయం ఉపాధి, పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా నైపుణ్య శిక్షణ *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* నూతన డీఐఈఓ ప్రభావతికి ఘన సన్మానం ఎమ్మెల్యేల పనితీరుపై బాబు పెదవి విరుపు

సాగునీరు అందించి పంటలు కాపాడండి. ఆర్ కృష్ణాపురం రైతుల వినతి

Select Suryaa Now
సాగునీరు అందించి పంటలు కాపాడండి. ఆర్ కృష్ణాపురం రైతుల వినతి

28వ బ్లాక్ ద్వారా  ఆర్ కృష్ణాపురం గ్రామానికి సాగునీరు అందించండి
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్; మండలంలోని ఆర్ కృష్ణాపురం గ్రామానికి తెలుగుగంగ 28వ బ్లాక్ ద్వారా సాగునీరు అందించాలని గ్రామస్తులు తెలుగంగ అధికారులను కోరుతున్నారు. గ్రామంలో 2000 ఎకరాల్లో వేరుశనగ పంటను సాగు చేశారని పంట కోత దశకు వచ్చే సమయంలో సాగునీరు లేకపోవడంతో పంట నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే గ్రామంలో 100కు పైగా బోర్లు నీరు రావడంలేదని భూగర్భ జలాలు తగ్గిపోయాయన్నారు. ఇప్పటికైనా అధికారులు గండ్లేరు రిజర్వాయర్ ద్వారా సాగునీరు అందించి  పంటలను కాపాడాలని ,గ్రామ పెద్దలు గోపిరెడ్డి శివారెడ్డి ,రఘునాథరెడ్డిలు అధికారులను కోరారు. తాను ఐదు ఎకరాల్లో వేరుశెనక్కాయ పంటను సాగు చేశానని గ్రామ రైతు రామలింగం అన్నారు. నీరు అందకపోతే పంట దెబ్బ తినే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా