BREAKING
ప్రతి ఇంటికి ఓటర్ స్లిప్పులు అందాలి అర్హులైన వారికి కొత్త పింఛన్లు : సర్పంచ్ ఈగ ప్రభాకర్ రెడ్డి నేనెవరినీ బ్లాక్ మెయిల్ చేయడం లేదు..హై కమాండ్ చెప్పినట్టు నడుచుకుంటా .. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన సర్పంచ్ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం - అర్హులైన రేషన్ కార్డు లబ్ధిదారులకు జీవిత బీమా కల్పన అంకత్‌పల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం యువతకు ఉపాధి అవకాశాలతో పాటు స్వయం ఉపాధి, పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా నైపుణ్య శిక్షణ *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* నూతన డీఐఈఓ ప్రభావతికి ఘన సన్మానం ఎమ్మెల్యేల పనితీరుపై బాబు పెదవి విరుపు ఐదేళ్లుగా పెంచుకున్న బిడ్డకు దూరమయ్యామంటూ తల్లిదండ్రుల ఆవేదన! చౌటుప్పల్‌లో బీజేపీ మోర్చాల నూతన కమిటీల నియామకం 23 నుంచి ఎస్కే యూనివర్సిటీ అంతర్ కళాశాలల క్రికెట్ టోర్నమెంట్ రూ.10 వేల లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి పట్టుబాటు వైఎస్ఆర్సిపి నాయకుడిపై హత్యాయత్నం-తీవ్రంగా ఖండించిన మాజీ ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి రెడ్డి ఎడ్లబండ్ల నుంచి బుల్లెట్ రైళ్ల వరకు.. దేశ ప్రగతిలో తొలి ఐఐటీది కీలక పాత్ర

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం - అర్హులైన రేషన్ కార్డు లబ్ధిదారులకు జీవిత బీమా కల్పన

Select Suryaa Now
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం - అర్హులైన రేషన్ కార్డు లబ్ధిదారులకు జీవిత బీమా కల్పన

సూర్య రాజంపేట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని రాజంపేట మండలంలోని పెద్దాయపల్లి గ్రామ పంచాయతీలో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్హులైన రేషన్ కార్డు లబ్ధిదారులకు జీవిత బీమా కల్పించే కార్యక్రమాన్ని చేపట్టారు. అర్హులైన ప్రతి కుటుంబానికి భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామంలోని అర్హులైన ప్రజలందరూ ఈ పథకం ద్వారా కల్పిస్తున్న జీవిత బీమా సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. కుటుంబంలో అనుకోని సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడంలో జీవిత బీమా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం అర్హులైన రేషన్ కార్డు లబ్ధిదారులకు బీమా సదుపాయం కల్పించే దిశగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం ప్రయోజనాలు అందేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పెద్దాయపల్లి గ్రామ సర్పంచ్ కంషెట్టి నరేష్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి బి. సూర్యాజీ, తహసీల్దార్ జానకి, మండల ప్రత్యేక అధికారి అపర్ణ, పంచాయతీ కార్యదర్శి శ్వేత, కంప్యూటర్ ఆపరేటర్లు చందు, ప్రవీణ్, టైపిస్ట్ అనంత, జూనియర్ అసిస్టెంట్ సాయిలుతో పాటు వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

-అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎంపీడీవో : ఇదిలా ఉండగా, రాజంపేట మండలంలో వీబీజీ రామ్‌జీ పథకంలో భాగంగా చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి బి. సూర్యాజీ రావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ పథకం కింద నిర్మిస్తున్న సోక్ పిట్స్, ఫామ్ పాండ్స్, సాసర్ పిట్స్ తదితర పనుల పురోగతిని తనిఖీ చేశారు. పనులు నాణ్యతతో, నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా చేపట్టాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, వ్యవసాయానికి అవసరమైన నీటి లభ్యత మెరుగుపడేలా ఇటువంటి పనులు దోహదపడతాయని పేర్కొన్నారు. అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ, పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కంషెట్టి నరేష్, టెక్నికల్ అసిస్టెంట్ రాజుతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.