BREAKING
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ.. కల్లమల్లలో లాఠీఛార్జ్ తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఆఫీసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ధర్నా న్యూయార్క్‌లో రోడ్డు ప్రమాదం: నల్గొండ జిల్లా యువకుడి దుర్మరణం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్లు మంజూరు హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నియంత్రణలో వికారాబాద్ జిల్లాకు జాతీయ గుర్తింపు తొలి టెస్టులో భారత్ జోరు 2022 వ్యయ బిల్లు ఆమోదంపై కోర్టు తీర్పు గాంధీ భవన్‌లో రక్తదానం చేసిన ఫిషరీస్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ వాహన మరమ్మతుల చట్టంపై న్యూజెర్సీపై దావా అమెరికా స్కూల్ డిస్ట్రిక్ట్‌లతో యూట్యూబ్ భారీ పరిష్కారానికి చేరువ? యూనియన్ పసిఫిక్ ఇంజినీర్ల యూనియన్‌కు భారీ పరిహారం గాంధీ భవన్‌లో రక్తదానం చేసిన ప్రశాంత్ మాజీ సీఈవో కత్పాడియా సేవలకు ఇండస్ఇండ్ బ్యాంక్ ముగింపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తాం _ఓ ఎస్ డి ప్రియదర్శిని

న్యూయార్క్‌లో రోడ్డు ప్రమాదం: నల్గొండ జిల్లా యువకుడి దుర్మరణం

Select Suryaa Now
న్యూయార్క్‌లో రోడ్డు ప్రమాదం: నల్గొండ జిల్లా యువకుడి దుర్మరణం

న్యూయార్క్ / నల్గొండ: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మునుగోడుకు చెందిన సాయితేజ న్యూయార్క్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే మృతి చెందాడు.

వివరాల్లోకి వెళితే.. సాయితేజ కారులో ప్రయాణిస్తుండగా, మార్గమధ్యంలో రోడ్డుపైకి అకస్మాత్తుగా వచ్చిన ఓ జింకను అతడి కారు ఢీకొట్టింది. దీంతో సాయితేజ కారును అక్కడే నిలిపివేశాడు. అయితే, అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ సరుకు రవాణా ట్రక్కు, ఆగి ఉన్న సాయితేజ కారును బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జవడంతో లోపల ఉన్న సాయితేజ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. చేతికి అందివచ్చిన కొడుకు అమెరికాలో మరణించాడన్న వార్త తెలియడంతో మునుగోడులోని సాయితేజ కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.