ప్రమాదకరంగా మారిన జాతీయ రహదారి.. తొలగించని వేలాడుతున్న వైర్లు
కందుకూరు, మేజర్ న్యూస్: కందుకూరు మండల కేంద్రంలోని శ్రీశైలం జాతీయ రహదారి 765పై స్ట్రీట్‌లైట్ స్తంభం ప్రమాదానికి గురై రెండు రోజులు గడుస్తున్నా వేలాడుతున్న విద్యుత్ వైర్లను తొలగించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో యూటర్న్ తీసుకునే వాహనదారులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున నేషనల్ హైవే అథారిటీ అధికారులు వెంటనే స్పందించి వేలాడుతున్న వైర్లను తొలగించి, దెబ్బతిన్న స్ట్రీట్‌లైట్ స్తంభాన్ని తొలగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
టి. శ్రీనివాస్, మేజర్ న్యూస్, కందుకూరు, రంగారెడ్డి జిల్లా