జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థి ఎంపిక
సూర్య కరీంనగర్:కరీంనగర్ కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థి ఆరుష్ వర్ధన్ 70వ SGF జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యాడు. హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్-14 బాలుర బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించి జాతీయ పోటీలకు అర్హత పొందాడు. ఈ నవంబర్‌లో మధ్యప్రదేశ్‌లో జాతీయ పోటీలు జరగనున్నాయి. ఈ సందర్భంగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి విద్యార్థికి పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. జాతీయస్థాయిలోనూ ప్రతిభ చాటి రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.