కావ్య మారన్-అనిరుధ్ వివాహ రిసెప్షన్‌కు సీఎం రేవంత్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం చెన్నైకి పయనమయ్యారు. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్‌ల వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొనేందుకు ఆయన వెళ్తున్నారు. సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్, కావేరీ మారన్ దంపతుల ఆహ్వానం మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఈ వేడుకకు హాజరవుతున్నారు.
నవంబరు 11న గ్రీస్‌లో సన్నిహితుల మధ్య వివాహ బంధంతో ఒక్కటైన అనిరుధ్, కావ్య మారన్‌ల జంట కోసం శనివారం చెన్నైలో ఘనంగా వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం రాత్రి తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.