BREAKING
అక్టోబర్‌లో భారత్ మౌలిక రంగాల (కోర్ సెక్టార్) వృద్ధి 10.9 శాతానికి చేరి సరికొత్త రికార్డు.. ఐటీ మంత్రి ఓఎస్డీ పేరుతో రూ.50.87 లక్షల టోకరా తెలుగు సినిమాల పైరసీపై సైబర్ క్రైమ్ కేసు "భారత్ వైపు చూడండి".. ఫెడరల్ రిజర్వ్ 'రాజకీయ' వైఖరిపై ట్రంప్ తీవ్ర విమర్శలు! స్నేహ గ్రూప్‌పై ఐటీ మెరుపు దాడులు మహారాష్ట్రలో ఎఫ్‌డీఏ చర్యలపై కెమిస్టుల ఆగ్రహం.. రాష్ట్రవ్యాప్త ఆందోళనకు హెచ్చరిక! ఘనంగా ప్రారంభమైన 'అంతార్ డెజెర్ట్స్' తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉట్స్ సారంగపల్లి లో జన సురక్ష,అవగాహనసదస్సు కార్యక్రమం సిక్కు వేర్పాటువాది హత్య కుట్ర కేసులో భారతీయుడికి 19 ఏళ్లకు పైగా జైలు శిక్ష.. న్యూయార్క్ కోర్టు సంచలన తీర్పు! కల్షిపై న్యూయార్క్ చర్యలను అడ్డుకునే సీఎఫ్‌టీసీ అత్యవసర అభ్యర్థనను తిరస్కరించిన అమెరికా జడ్జి మీ మెదడుపై మూత్రం పోస్తాను".. ఎన్విడియాలో జెన్సన్ హువాంగ్ 'భయానక పాలన'పై సంచలన ఆరోపణలు! టాటా సన్స్ బోర్డు భేటీ రికార్డింగ్‌లు కోరిన నోయెల్ టాటా.. చంద్రశేఖరన్ పునర్నియామకంపై వేణు శ్రీనివాసన్ ఓటింగ్‌కు అభ్యంతరం! గ్రబ్‌హబ్ విక్రయంపై వండర్ సంస్థ కసరత్తు

స్నేహ గ్రూప్‌పై ఐటీ మెరుపు దాడులు

Select Suryaa Now
స్నేహ గ్రూప్‌పై ఐటీ మెరుపు దాడులు

హైదరాబాద్‌: ప్రముఖ పౌల్ట్రీ, అగ్రి బిజినెస్ దిగ్గజ సంస్థ 'స్నేహ గ్రూప్'పై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. పన్ను ఎగవేత, ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని మొత్తం 16 ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో ఆకస్మిక సోదాలు చేపట్టారు.

హైదరాబాద్‌ కొండాపూర్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు విజయవాడ తదితర ప్రాంతాల్లోని కంపెనీ యూనిట్లు, కార్యాలయాల్లో ఐటీ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అలాగే సంస్థ డైరెక్టర్లు రామ్ రెడ్డి డెండి, వరుణ్ రెడ్డి డెండి, స్నేహ డెండి నివాసాల్లోనూ అధికారులు కీలక పత్రాలు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతుండటంతో స్వాధీనం చేసుకున్న నగదు, పత్రాల వివరాలపై ఐటీ శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.