BREAKING
ఫ్రాన్స్‌లో పోలీసుల కాల్పులకు చట్టబద్ధత కల్పించే బిల్లుకు సెనెట్‌ ఆమోదం.. వరికుంట పంచాయతీలో వైసీపీకి భారీ షాక్ టీడీపీలోకి పలువురు నాయకుల చేరిక ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ యోగా, వాకింగ్‌ను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి గ్రాండ్‌ తెఫ్ట్‌ ఆటో కొత్త ఆట సంచలన రికార్డు.. తొలి 24 గంటల్లోనే 379 కోట్ల డాలర్ల అమ్మకాలు! పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష.. బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం భారత్-యూకే వాణిజ్య ఒప్పందంతో రైతులు, ఎగుమతిదారులు, చిన్న వ్యాపారాలకు అవకాశాలు అమెరికా వాటా విపణిలో కృత్రిమ మేధ సంస్థల వాటాల పతనం మరింత తీవ్రం.. భారీ నష్టాల్లో టెక్ సూచీలు! యూట్యూబ్‌ విద్యార్థుల మానసిక ఆరోగ్య కేసుల పరిష్కారానికి 300 కోట్ల డాలర్ల ఒప్పంద ప్రతిపాదన.. ఐక్యరాజ్యసమితి తదుపరి ప్రధాన కార్యదర్శి ఎంపికలో రెబెకా గ్రిన్స్‌పాన్‌కు రెండు శాశ్వత సభ్యదేశాల వ్యతిరేకత.. ప్రజల గుండెల్లో ప్రవీణ్ రెడ్డి.. కోడిగెనహళ్లికి ఇలాంటి నాయకత్వమే కావాలంటున్న గ్రామస్తులు! ఫ్రాన్స్‌లో పోలీసుల కాల్పులపై కొత్త చట్టానికి సెనెట్‌ ఆమోదం. స్పేస్‌ఎక్స్‌కు చిప్‌ల కొనుగోలు కోసం రూ.3.9 లక్షల కోట్లకు పైగా రుణ సమీకరణ టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌కు న్యాయపరమైన విజయం అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గించేందుకు మరోసారి వడ్డీ రేట్లు పెంచాల్సిందేనన్న కేంద్ర బ్యాంకు అధికారి కృత్రిమ మేధ సంస్థల రుణాలపై నిఘా పెంచుతున్న అమెరికా కేంద్ర బ్యాంకు..

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష.. బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం

Select Suryaa Now
పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష.. బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన పోక్సో కేసులో నిందితుడికి వికారాబాద్ న్యాయస్థానం 20 సంవత్సరాల కారాగార శిక్ష విధించడంతో పాటు బాధితురాలికి ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల పరిహారం మంజూరు చేయాలని తీర్పు వెల్లడించింది. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఐపీఎస్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.వివరాల్లోకి వెళితే.. తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 2017లో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనపై క్రైమ్ నంబర్ 76/2017గా ఐపీసీ 366, 376(2)(i)(n), 506 సెక్షన్లతో పాటు పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో జినుగుర్తి గ్రామానికి చెందిన బండమిడి నర్సింలు (37)పై నేరం రుజువు కావడంతో వికారాబాద్ మొదటి అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి పి. ప్రదీప్ నాయక్ 20 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. బాధితురాలికి ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల పరిహారం అందించనున్నారు.ఈ కేసులో మొదటి దర్యాప్తు అధికారిగా అప్పటి తాండూరు ఎస్‌హెచ్‌ఓ ఎం. వెంకట రామయ్య, రెండో దర్యాప్తు అధికారిగా అప్పటి తాండూరు డీఎస్పీ ఎం. రామచంద్రుడు వ్యవహరించారు. ప్రస్తుత తాండూరు ఎస్‌హెచ్‌ఓ జి. పరమేశ్వర్ గౌడ్ తదుపరి న్యాయపరమైన ప్రక్రియలను సమన్వయం చేశారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెరాజ్ ఫిర్దౌస్ ప్రభుత్వ తరఫున న్యాయస్థానంలో వాదనలు వినిపించగా, భారోసా కేంద్రం తరఫున కీర్తి ఆకుల బాధితురాలికి న్యాయపరమైన సహకారం అందించారు.కోర్టు డ్యూటీ అధికారులుగా ఎం.డి. షరీఫ్ (పీసీ 11336), గతంలో పనిచేసిన ఎం.డి. తౌఫీక్ (పీసీ 10327) విధులు నిర్వహించారు. బ్రీఫింగ్ ఆఫీసర్, వికారాబాద్ మొదటి అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు లైజన్ అధికారిగా ఎస్. నిరంజన్ గౌడ్ (పీసీ 5598) బాధ్యతలు నిర్వర్తించారు.ఈ సందర్భంగా ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ.. మహిళలు, బాలికలపై జరిగే నేరాల పట్ల జిల్లా పోలీస్ శాఖ అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ప్రతి కేసులో సమర్థవంతమైన దర్యాప్తు చేపట్టి, నేరం రుజువయ్యేలా పటిష్టమైన ఆధారాలను న్యాయస్థానానికి సమర్పించాలని పోలీస్ అధికారులకు సూచించారు. బాధితులకు న్యాయం జరిగేలా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.నిందితుడికి శిక్ష పడేలా సమన్వయంతో పనిచేసిన పోలీస్ అధికారులు, సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్, భారోసా కేంద్రం సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.