వరికుంట పంచాయతీలో వైసీపీకి భారీ షాక్ టీడీపీలోకి పలువురు నాయకుల చేరిక
అట్లూరు మేజర్ న్యూస్
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం లోని అట్లూరు మండలంవరికుంట పంచాయతీ చెందిన వైసిపి నాయకులు ఎరగం రెడ్డి భాస్కర్ రెడ్డి గారితో పాటు పలువురు నాయకులు బద్వేల్ టిడిపి ఇన్చార్జ్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి సమక్షంలో టిడిపి కార్యాలయంలో టిడిపి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంచూరు సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో సంక్షేమ పథకాలతో పాటురాష్ట్రం అభివృద్ధి చందడంతో పాటు మండలాల అభివృద్ధి చెందాలంటే టిడిపి పార్టీలోనే సాధ్యమని ఆకర్షితులై అట్లూరు మండలo వరికుంట పంచాయతీకి చెందినవైసిపి నాయకులకు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో ఎరగం రెడ్డి భాస్కర్ రెడ్డి, ఎరగం రెడ్డి బాలరెడ్డి, పాటూరు శివరాం రెడ్డి, పల్లె కృష్ణారెడ్డి, బుర్రి గోపికృష్ణ, గొర్ల రాజయ్య, గొర్రెలు ఏరుకులయ్య, రామ్ హరి ప్రసాద్, గొర్ల మురళి, గొర్ల వేణుగోపాల్, ఎరగం రెడ్డి ఓబుల్ రెడ్డి, పరుగుంట గోపాల్, వరికుంట సుబ్బరాయుడు, వరికుంట కృష్ణ, వరికుంట నాగమణి తదితరులు ఉన్నారు.
రిపోర్టర్. అట్లు తిరుపాల్. అట్లూరు మండలం, కడప జిల్లా