ప్రజల గుండెల్లో ప్రవీణ్ రెడ్డి.. కోడిగెనహళ్లికి ఇలాంటి నాయకత్వమే కావాలంటున్న గ్రామస్తులు!
పరిగి మేజర్ న్యూస్ | కోడిగెనహళ్లి:
పరిగి మండలం కోడిగెనహళ్లి పంచాయతీ టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఖరారు కావడంతో ఆయన ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతూ ఎన్నో అవమానాలు ఆటుపోట్లు ఎదురైనా వెనుకడుగు వేయకుండా పనిచేసిన ఆయనకు పార్టీ అధిష్ఠానం అవకాశం కల్పించింది. ప్రస్తుతం గ్రామంలోని ప్రజలను కలుస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఆప్యాయంగా స్వాగతం పలుకుతూ ప్రజల మధ్య ఉంటూ సమస్యలను పరిష్కరించే ఇలాంటి నాయకుడే తమ పంచాయతీకి అవసరమని అభిప్రాయపడుతున్నారు. గ్రామాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండే నాయకుడిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నారు.పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి గుర్తింపు పొందిన ప్రవీణ్ రెడ్డి ఇప్పుడు మా పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా రావడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రజల ఆశయాలకు ప్రతిరూపంగా ప్రతి కుటుంబానికి ఆత్మీయుడిగా గ్రామాభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేసే నాయకుడిగా ఆయన నిలవాలని కోరుకుంటున్నాం. కోడిగెనహళ్లి పంచాయతీకి ఇలాంటి యువ నాయకత్వం రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం అంటూ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పరిగి సూర్య రిపోర్టర్ నవీన్…