BREAKING
కొంకణి, మరాఠీ కథలకు అంతర్జాతీయ వేదిక గోవాలో 57వ ఇఫీ ఘనంగా ప్రారంభం: 86 దేశాల నుంచి 150కి పైగా చిత్రాలు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన డైవింగ్ సపోర్ట్ క్రాఫ్ట్ డీఎస్‌సీ ఏ21 నౌకాదళానికి అప్పగింత అంతర్జాతీయ వ్యాపార, సాంకేతిక, దౌత్య విపణుల్లో సంచలనాలు.. రోడ్డు ప్రమాదం తీవ్రంగా కలచివేసింది. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. ఫోర్డ్‌, హోండా సహా నాలుగు వాహన సంస్థలు న్యూజెర్సీ ప్రభుత్వంపై కేసు.. ఫ్రాన్స్‌లో పోలీసుల కాల్పులకు చట్టబద్ధత కల్పించే బిల్లుకు సెనెట్‌ ఆమోదం.. వరికుంట పంచాయతీలో వైసీపీకి భారీ షాక్ టీడీపీలోకి పలువురు నాయకుల చేరిక ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ యోగా, వాకింగ్‌ను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి గ్రాండ్‌ తెఫ్ట్‌ ఆటో కొత్త ఆట సంచలన రికార్డు.. తొలి 24 గంటల్లోనే 379 కోట్ల డాలర్ల అమ్మకాలు! పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష.. బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం భారత్-యూకే వాణిజ్య ఒప్పందంతో రైతులు, ఎగుమతిదారులు, చిన్న వ్యాపారాలకు అవకాశాలు అమెరికా వాటా విపణిలో కృత్రిమ మేధ సంస్థల వాటాల పతనం మరింత తీవ్రం.. భారీ నష్టాల్లో టెక్ సూచీలు! యూట్యూబ్‌ విద్యార్థుల మానసిక ఆరోగ్య కేసుల పరిష్కారానికి 300 కోట్ల డాలర్ల ఒప్పంద ప్రతిపాదన.. ఐక్యరాజ్యసమితి తదుపరి ప్రధాన కార్యదర్శి ఎంపికలో రెబెకా గ్రిన్స్‌పాన్‌కు రెండు శాశ్వత సభ్యదేశాల వ్యతిరేకత..

ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ యోగా, వాకింగ్‌ను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి

Select Suryaa Now
ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ యోగా, వాకింగ్‌ను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి

సూర్య రాజన్న సిరిసిల్ల…జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే  ఆదేశాల మేరకు ఆర్.ఐ అడ్మిన్ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయ పరేడ్ మైదానంలో ఆర్మ్డ్ రిజర్వ్, సివిల్ పోలీస్, హోంగార్డు సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది ప్రదర్శించిన వివిధ డ్రిల్స్‌ను ఆర్.ఐ అడ్మిన్ పరిశీలించారు.ఈసందర్భంగా ఆర్.ఐ సురేష్ మాట్లాడుతూ.. 
ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రతిరోజూ ఉదయం కనీసం అరగంట పాటు యోగా, ధ్యానం లేదా నడక అలవాటు చేసుకోవాలని సూచించారు. సాధ్యమైనంత వరకు బయట ఆహారం తీసుకోవడం తగ్గించాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు.వీక్లీ పరేడ్ ద్వారా పోలీస్ సిబ్బందిలో క్రమశిక్షణ, ఐక్యత, సమన్వయం, శారీరక దృఢత్వం పెంపొందుతాయని పేర్కొన్నారు. 
పోలీస్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం.*
పోలీస్ సిబ్బందిలో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆర్. సతీష్ కుమార్ సిబ్బందికి గుండె ఆరోగ్యం, గుండెపోటు నివారణ, రక్తపోటు, మధుమేహం, ఆరోగ్యకరమైన జీవనశైలి తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను నివారించవచ్చని వివరించారు.
ఆర్.ఐ రమేష్, పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఆర్.ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.