తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుమలకు భక్తుల రాక కొనసాగుతోంది. శనివారం ఉదయం సమయానికి శ్రీవారి సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 6 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఎలాంటి దర్శన టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనం పూర్తి కావడానికి సుమారు 4 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు.
కాగా, శుక్రవారం ఒక్కరోజే 56,695 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరిలో 24,786 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న శ్రీవారి హుండీకి రూ.4.28 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ ప్రకటించింది.