BREAKING
తెలంగాణను వణికిస్తున్న చలి.. శబరిమలలో పోటెత్తిన అయ్యప్ప భక్తులు పొన్నూరు 22వ వార్డు వీవర్స్ కాలనీ లో జనసేన అభ్యర్థి దేశంశెట్టి. కనకరత్నం గడపగడప విస్తృత ప్రచారం, ప్రజలతో మామేకమై ముందుకు సాగుతున్న దేశంశెట్టి. కనకరత్నం నేడు మూడు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన కావ్య మారన్-అనిరుధ్ వివాహ రిసెప్షన్‌కు సీఎం రేవంత్ కొనుగోలుకు ఉత్తమ బ్యాంక్ షేర్లు.. మోతీలాల్ ఓస్వాల్ టాప్ పిక్స్‌లో ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ! ఐటీ మంత్రి ఓఎస్డీ పేరుతో రూ.50.87 లక్షల టోకరా అక్టోబర్‌లో భారత్ మౌలిక రంగాల (కోర్ సెక్టార్) వృద్ధి 10.9 శాతానికి చేరి సరికొత్త రికార్డు.. ఐటీ మంత్రి ఓఎస్డీ పేరుతో రూ.50.87 లక్షల టోకరా తెలుగు సినిమాల పైరసీపై సైబర్ క్రైమ్ కేసు "భారత్ వైపు చూడండి".. ఫెడరల్ రిజర్వ్ 'రాజకీయ' వైఖరిపై ట్రంప్ తీవ్ర విమర్శలు! స్నేహ గ్రూప్‌పై ఐటీ మెరుపు దాడులు మహారాష్ట్రలో ఎఫ్‌డీఏ చర్యలపై కెమిస్టుల ఆగ్రహం.. రాష్ట్రవ్యాప్త ఆందోళనకు హెచ్చరిక! ఘనంగా ప్రారంభమైన 'అంతార్ డెజెర్ట్స్' తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

ఐటీ మంత్రి ఓఎస్డీ పేరుతో రూ.50.87 లక్షల టోకరా

Select Suryaa Now
ఐటీ మంత్రి ఓఎస్డీ పేరుతో రూ.50.87 లక్షల టోకరా

హైదరాబాద్‌: తెలంగాణ ఐటీ మంత్రి ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) పేరుతో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన ఘరానా మోసగాడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. నిందితుడు కొలుగూరి రవికిరణ్‌పై ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

నిందితుడు కొలుగూరి రవికిరణ్ తాను ఐటీ మంత్రి వద్ద ఓఎస్డీగా పనిచేస్తున్నట్లు నకిలీ ఐడీ కార్డును సృష్టించి నిరుద్యోగులకు ఎర వేశాడు. అంతేకాకుండా, అసలైన ప్రభుత్వ వెబ్‌సైట్లను పోలిన నకిలీ పోర్టల్స్‌ను రూపొందించి, వాటి ద్వారా అభ్యర్థులను పూర్తిగా నమ్మించాడు. టీచర్, అటెండర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, రికార్డ్ అసిస్టెంట్ వంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి నలుగురు బాధితుల నుంచి మొత్తం రూ.50.87 లక్షలు కాజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నకిలీ వెబ్‌సైట్లు, ఐడీ కార్డుల ఆధారంగా పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.