BREAKING
ఒవైసీ చిత్రపటాలను దగ్ధం చేసిన నిరసనకారులు; ఆదినారాయణరెడ్డి అలకపై బీజేపీ అధిష్ఠానం బుజ్జగింపులు తెలంగాణను వణికిస్తున్న చలి.. శబరిమలలో పోటెత్తిన అయ్యప్ప భక్తులు పొన్నూరు 22వ వార్డు వీవర్స్ కాలనీ లో జనసేన అభ్యర్థి దేశంశెట్టి. కనకరత్నం గడపగడప విస్తృత ప్రచారం, ప్రజలతో మామేకమై ముందుకు సాగుతున్న దేశంశెట్టి. కనకరత్నం నేడు మూడు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన కావ్య మారన్-అనిరుధ్ వివాహ రిసెప్షన్‌కు సీఎం రేవంత్ కొనుగోలుకు ఉత్తమ బ్యాంక్ షేర్లు.. మోతీలాల్ ఓస్వాల్ టాప్ పిక్స్‌లో ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ! ఐటీ మంత్రి ఓఎస్డీ పేరుతో రూ.50.87 లక్షల టోకరా అక్టోబర్‌లో భారత్ మౌలిక రంగాల (కోర్ సెక్టార్) వృద్ధి 10.9 శాతానికి చేరి సరికొత్త రికార్డు.. ఐటీ మంత్రి ఓఎస్డీ పేరుతో రూ.50.87 లక్షల టోకరా తెలుగు సినిమాల పైరసీపై సైబర్ క్రైమ్ కేసు "భారత్ వైపు చూడండి".. ఫెడరల్ రిజర్వ్ 'రాజకీయ' వైఖరిపై ట్రంప్ తీవ్ర విమర్శలు! స్నేహ గ్రూప్‌పై ఐటీ మెరుపు దాడులు మహారాష్ట్రలో ఎఫ్‌డీఏ చర్యలపై కెమిస్టుల ఆగ్రహం.. రాష్ట్రవ్యాప్త ఆందోళనకు హెచ్చరిక!

నేడు మూడు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన

Select Suryaa Now
నేడు మూడు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం పశ్చిమబెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన చేపట్టారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు విద్యా, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలతో పాటు భారీ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొంటారు.

ముందుగా ఉదయం పశ్చిమబెంగాల్‌లోని ఐఐటీ ఖరగ్‌పూర్ వజ్రోత్సవ (ప్లాటినం జూబ్లీ) వేడుకలకు ప్రధాని మోదీ హాజరై, సంస్థ 75 ఏళ్ల ప్రస్థానానికి గుర్తుగా 75 మంది విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం బిహార్‌లోని వైశాలి జిల్లాకు చేరుకుని సుమారు రూ. 34,470 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇందులో భాగంగా గంగా నదిపై నిర్మించిన ఆరు వరుసల 'నితీష్ సేతు' వంతెనను జాతికి అంకితం చేయనున్నారు. సాయంత్రం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఇందిరాగాంధీ ప్రతిష్ఠాన్‌లో జరగనున్న 5వ 'కౌశల్ దీక్షాంత్ సమారోహ్' వేడుకలో ప్రధాని పాల్గొని, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన 52 మంది ఐటీఐ టాపర్లను సత్కరించనున్నారు.