ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ
, సూర్య మాక్లూర్ :మాక్లూర్ మండలం గుంజీలి గ్రామంలో రెండో విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని గ్రామ సర్పంచ్ గోపు గోపి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోపు గోపి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హరీష్, మండల మైనార్టీ అధ్యక్షుడు సలీం, మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, నవతే నవీన్,ప్రతాప్, గ్రామ కార్యదర్శి దినేష్, లబ్ధిదారులు పాల్గొన్నారు.