BREAKING
హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నియంత్రణలో వికారాబాద్ జిల్లాకు జాతీయ గుర్తింపు తొలి టెస్టులో భారత్ జోరు 2022 వ్యయ బిల్లు ఆమోదంపై కోర్టు తీర్పు గాంధీ భవన్‌లో రక్తదానం చేసిన ఫిషరీస్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ వాహన మరమ్మతుల చట్టంపై న్యూజెర్సీపై దావా అమెరికా స్కూల్ డిస్ట్రిక్ట్‌లతో యూట్యూబ్ భారీ పరిష్కారానికి చేరువ? యూనియన్ పసిఫిక్ ఇంజినీర్ల యూనియన్‌కు భారీ పరిహారం గాంధీ భవన్‌లో రక్తదానం చేసిన ప్రశాంత్ మాజీ సీఈవో కత్పాడియా సేవలకు ఇండస్ఇండ్ బ్యాంక్ ముగింపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తాం _ఓ ఎస్ డి ప్రియదర్శిని ఖాతాల తొలగింపు వివాదంపై భారత్‌లోని మెటా కార్యాలయాల వద్ద విపక్షాల నిరసనలు ముత్యాలపేటలో సత్యనారాయణ స్వామి వ్రతం దక్షిణాఫ్రికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలు, ఐరాస మాజీ అధికారిణి కన్నుమూత 2028 నాటికి కిల్లర్ రోబోట్ల నియంత్రణపై ఐరాస చర్చలకు దేశాల అంగీకారం గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలి- జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

ద్వారకా తిరుమల శ్రీవారి సేవలో చింతమనేని కుటుంబం

Select Suryaa Now
ద్వారకా తిరుమల శ్రీవారి సేవలో చింతమనేని కుటుంబం

- *"ద్వారకాతిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఏలూరు జడ్పీ ఛైర్‌పర్సన్  చింతమనేని సాయి నవ్యశ్రీ, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్..*

- *జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకార అనంతరం నేడు కుటుంబ సమేతంగా చిన్న తిరుపతి శ్రీవారి సేవలో పాల్గొన్న చింతమనేని కుటుంబం.*

- *ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి, వేదాశీర్వచనం అందజేసిన ఆలయ వేద పండితులు*.

- *ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ఏలూరు జిల్లా మరింత అభివృద్ధి పథంలో పయనించాలని స్వామివారిని కోరిన చింతమనేని కుటుంబం*

--------

ఏలూరు/ద్వారకాతిరుమల, మేజర్ న్యూస్:

ఏలూరు జిల్లా పరిషత్ నూతన ఛైర్‌పర్సన్‌గా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన చింతమనేని సాయి నవ్యశ్రీ, దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ శనివారం ఉదయం కుటుంబ సమేతంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల (చిన్న తిరుపతి) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. పదవీ ప్రమాణ స్వీకారం అనంతరం తొలిసారిగా వారు స్వామివారి సన్నిధికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ తూర్పు గోపురం వద్దకు చేరుకున్న జడ్పీ ఛైర్‌పర్సన్ సాయి నవ్యశ్రీ దంపతులు, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దంపతులు, వంకినేని భాను ప్రకాష్ దంపతులు మరియు కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శన అనంతరం, ఆలయ మండపంలో అర్చకులు వారికి స్వామివారి శేషవస్త్రాలను కప్పి, వేద మంత్రోచ్ఛారణలతో వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, జ్ఞాపికలను బహూకరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా ప్రజలందరిపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని, జిల్లా మరింత అభివృద్ధి పథంలో పయనించాలని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో పలువురు భక్తులు, అయ్యప్ప స్వాములు మరియు స్థానిక నాయకులు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జడ్పీ ఛైర్‌పర్సన్ సాయి నవ్యశ్రీ లను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.