BREAKING
శాంతిభద్రత లే లక్ష్యం .. ఎస్ ఐ శ్రీనివాసులు నంద్యాల జిల్లాలో ప్రతి నిరక్షరాస్యుడిని అక్షరాస్యుడిగా తీర్చిదిద్దాలి- జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా కళ్యాణదుర్గం మున్సిపల్ ఎన్నికలపై కోర్టులో కేసు. విచారణ సోమవారానికి వాయిదా. మరణములోనూ వీడని బంధం పాపయ్యపాలెం జాజిగడ్డ రిజర్వాయర్ మరమత్తులకు చర్యలు. కొత్త పాలకవర్గాలకు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మున్సిపల్ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే అమిలినేనిని ఆహ్వానించిన బుట్నా లక్ష్మి తిమ్మరాజు. మోమిన్‌పేట్‌లో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ తనిఖీలు.. 14.5 లీటర్ల మద్యం, 500 గుట్కా ప్యాకెట్లు స్వాధీనం నూతన వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ వెల్లింగ్టన్‌లో టీమిండియా జోరు.. రాహుల్ శతకం, గిల్ 98 పరుగులు! చేయూత నూతన పెన్షన్లు అందజేసిన సర్పంచ్ రావూస్ కళాశాల విద్యార్థి వైఎన్ఎల్ చరణ్ జిత్ కి గోల్డ్ మెడల్ యూట్యూబర్లు జర్నలిస్ట్ లేనా.... జర్నలిస్టుల రక్షణలు వర్తించవన్న ఢిల్లీ పోలీసుల వాదన. ఆర్వో అత్యుత్సాహం.. నామినేషన్ కేంద్రం లో ఆర్వో చేతివాటం. నామినేషన్ పత్రాన్ని దిద్దిన ఆర్వో. ఒవైసీ చిత్రపటాలను దగ్ధం చేసిన నిరసనకారులు;

శాంతిభద్రత లే లక్ష్యం .. ఎస్ ఐ శ్రీనివాసులు

Select Suryaa Now
శాంతిభద్రత లే లక్ష్యం .. ఎస్ ఐ శ్రీనివాసులు

 

ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి,సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మిగనూరు రూరల్ ఎస్‌ఐ కె. శ్రీనివాసులు తెలిపారు.కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు, డీఎస్పీ ఏ. శ్రీనివాసులు, సీఐ ఎస్. చిరంజీవి పర్యవేక్షణలో సమస్యాత్మక గ్రామమైన బనవాసిలో శనివారం పోలీసులు కార్డెన్‌ అండ్‌ సెర్చ్‌ నిర్వహించారు. రూరల్, ట్రాఫిక్ పోలీసులతో పాటు స్పెషల్ పార్టీకి చెందిన 20 మంది సిబ్బంది పాల్గొని గ్రామంలో కవాతు నిర్వహించారు. అనుమానితులు, రౌడీషీటర్లు, వివాదాస్పద వ్యక్తుల ఇళ్లను తనిఖీ చేశారు. సరైన ధ్రువపత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని, పత్రాలు పరిశీలించిన అనంతరం యజమానులకు అప్పగించారు.ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ ఎన్నికల్లో అల్లర్లు, గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైన వారిపై బైండోవర్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు, అసత్య ప్రచారాలు చేసినా చర్యలు తప్పవన్నారు. ఓటర్లు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మహిళలు, బాలికలు, చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, దాడులకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

A. R. శరత్ కుమార్, సూర్య ప్రతినిధి, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా l