కొత్త పాలకవర్గాలకు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్
ఏలూరు, మేజర్ న్యూస్: పెదవేగి మండల జడ్పిటిసిగా ఏకగ్రీవంగా ఎన్నికై, ఏలూరు జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేసిన చింతమనేని సాయి నవ్యశ్రీకి, వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన బొర్రా చలమయ్యకి, జడ్పీటీసీ సభ్యులందరికీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎంపీ శుక్రవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. అదే విధంగా జిల్లాలోని అన్ని మండలాల్లో ఎంపీపీలుగా, వైస్ ఎంపీపీలుగా, ఎంపిటిసి సభ్యులుగా ప్రమాణ శ్రీకారం చేసిన నేతలందరికీ కూడా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేశారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, పదవులు అధిష్టించిన నేతలందరూ సేవాభావంతో ఉంటూ, జిల్లా అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తన ప్రకటనలో వెల్లడించారు.