BREAKING
శాంతిభద్రత లే లక్ష్యం .. ఎస్ ఐ శ్రీనివాసులు నంద్యాల జిల్లాలో ప్రతి నిరక్షరాస్యుడిని అక్షరాస్యుడిగా తీర్చిదిద్దాలి- జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా కళ్యాణదుర్గం మున్సిపల్ ఎన్నికలపై కోర్టులో కేసు. విచారణ సోమవారానికి వాయిదా. మరణములోనూ వీడని బంధం పాపయ్యపాలెం జాజిగడ్డ రిజర్వాయర్ మరమత్తులకు చర్యలు. కొత్త పాలకవర్గాలకు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మున్సిపల్ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే అమిలినేనిని ఆహ్వానించిన బుట్నా లక్ష్మి తిమ్మరాజు. మోమిన్‌పేట్‌లో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ తనిఖీలు.. 14.5 లీటర్ల మద్యం, 500 గుట్కా ప్యాకెట్లు స్వాధీనం నూతన వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ వెల్లింగ్టన్‌లో టీమిండియా జోరు.. రాహుల్ శతకం, గిల్ 98 పరుగులు! చేయూత నూతన పెన్షన్లు అందజేసిన సర్పంచ్ రావూస్ కళాశాల విద్యార్థి వైఎన్ఎల్ చరణ్ జిత్ కి గోల్డ్ మెడల్ యూట్యూబర్లు జర్నలిస్ట్ లేనా.... జర్నలిస్టుల రక్షణలు వర్తించవన్న ఢిల్లీ పోలీసుల వాదన. ఆర్వో అత్యుత్సాహం.. నామినేషన్ కేంద్రం లో ఆర్వో చేతివాటం. నామినేషన్ పత్రాన్ని దిద్దిన ఆర్వో. ఒవైసీ చిత్రపటాలను దగ్ధం చేసిన నిరసనకారులు;

రావూస్ కళాశాల విద్యార్థి వైఎన్ఎల్ చరణ్ జిత్ కి గోల్డ్ మెడల్

Select Suryaa Now
రావూస్ కళాశాల విద్యార్థి వైఎన్ఎల్ చరణ్ జిత్ కి గోల్డ్ మెడల్

సూర్య, నంద్యాల బ్యూరో:నంద్యాల పట్టణంలోని రావూస్ జూనియర్ కళాశాల విద్యార్థి వైఎన్ఎల్ చరణ్ జిత్ కు రాష్ట్రస్థాయి ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫినిషింగ్ టోర్నమెంట్లో గోల్డ్ మెడల్ సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ రోడ్డ సుంకయ్య తెలిపారు. ఈనెల 17 నుంచి 20వతేది వరకు నంద్యాల పట్టణంలోని పద్మావతినగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన పోటీల్లో టీం పరంగా గోల్డ్ మెడల్, వ్యక్తిగతంగా బ్రౌన్ మెడల్ సాధించినట్లు తెలిపారు. ఈనెల 15న కాకినాడ నందు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ సీనియర్ పురుషుల విభాగంలో ఫెన్సింగ్ నందు టీం పరంగా సిల్వర్ మెడల్ సాధించినట్లు తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో డిసెంబర్ 17 నుంచి 20వరకు జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో నిర్వహించనున్న ఫెన్సింగ్ పోటీల్లో కర్నూలు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలిపారు. విద్యాసంస్థల ఛైర్మెన్ ఎఎంవి అప్పారావు, డైరెక్టర్ ఎ.మోనిచంద్రలు మాట్లాడుతూ రావూస్ కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతను అందించడమే కాకుండా విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నందు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. చరణ్ జిత్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ టీంతోపాటు వ్యక్తిగతంగా సాధించడమే లక్ష్యమన్నారు. ఆటలతోపాటు చదువులో మంచి మార్కులు తెచ్చుకొని జీవితంలో పోలీసు ఉద్యోగం కానీ, సైనికునిగా ఉద్యోగం సాధించడమే లక్ష్యమన్నారు. దేశానికి, సమాజానికి, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొని వస్తానన్నారు. *మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*