నూతన వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ
నూతన వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ.
మైదుకూరు/ఏలూరు, మేజర్ న్యూస్: పవిత్ర వివాహ బంధంతో ఒకటైన నూతన దంపతులకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. కడప జిల్లా మైదుకూరు మండలం, నల్లపురెడ్డిపల్లె గ్రామానికి చెందిన శ్రీ ఓబిళ్ళ కొండయ్య, శ్రీమతి ఓబిళ్ళ విజయలక్ష్మి దంపతుల కుమారుడు, ఏలూరులోని ఎంపీ కార్యాలయంలో పనిచేసే ఓబిళ్ళ మస్తాన్ నాయుడు వివాహం, కడప జిల్లా చాపాడు మండలం సీతారాంపురం గ్రామ వాస్తవ్యులైన శ్రీ గుజ్జు తిరుపతయ్య, శ్రీమతి గుజ్జు నాగసరిత (లేటు) దంపతుల ఏకైక కుమార్తె గుజ్జు కళ్యాణి తో అల్లాడుపల్లి టిటిడి కళ్యాణ మండపంలో శుక్రవారం ఉదయం వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి, "మహేష్ అన్న పెళ్లి కానుక" బహుమతులను అందజేశారు.