ముత్యాలపేటలో సత్యనారాయణ స్వామి వ్రతం
ముత్యాలపేటలో సత్యనారాయణ స్వామి వ్రతం
చీరాల ముత్యాలపేటలోని మహాలక్ష్మమ్మ అమ్మవారి చెట్టు వద్ద శ్రీ శ్రీ శ్రీ మహాలక్ష్మమ్మ భక్త సమాజం ఆధ్వర్యంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతం తొమ్మిదో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో దంపతులు వ్రతంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో పూజా ప్రాంగణం సందడిగా మారింది.