అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్లు మంజూరు
సూర్య జగిత్యాల ప్రతినిధి:అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చేయూత పింఛన్లు అందజేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ సంఘం అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల ప్రోసిడింగ్ లతో పాటు కల్యాణ లక్ష్మి చెక్కులు, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంత్రి లక్ష్మణ్ కుమార్ పంపిణీ చేశారు.ఈసందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు 200 యూనిట్లకు పేదల తరుపున ప్రభుత్వం కరెంట్ బిల్లు చెల్లిస్తుందని మంత్రి తెలిపారు. మహిళలు ఆర్టీసీలు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నా మని మంత్రి తెలిపారు.బుగ్గారం మండలానికి 422 ఇందిర ఇళ్లను మంజూరు చేశామని మంత్రి తెలిపారు. మండలంలో అర్హత ఉన్న ఇందిరమ్మ ఇళ్ల ను అందజేస్తామని మంత్రి తెలిపారు. బుగ్గారం మండల అభివృద్ధి కి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.బుగ్గారం మండల కేంద్రంలో నిర్మించిన పోచమ్మ ఫంక్షన్ హాల్ ని మంత్రి ఈ సందర్భంగా ప్రారంభించారు. కార్యక్రమంలో మండలంలోని వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.