BREAKING
అంబేద్కర్ అవార్డు గ్రహీత ఎర్పుల ఆనంద్ కు ఘనంగా సన్మానం నిజామాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర రద్దు.. అంబేద్కర్ అవార్డు గ్రహీత ఎర్పుల ఆనంద్ కు ఘనంగా సన్మానం సేవే లక్ష్యం గ్రామ అభివృద్దే నా ధ్యేయం శంకరాపురం సర్పంచ్ టిడిపి అభ్యర్థి పూర్ణచంద్రరావు సాగునీరు అందించి పంటలు కాపాడండి. ఆర్ కృష్ణాపురం రైతుల వినతి అనంతపురం మేయర్‌గా రమేష్ గౌడ్ ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్.. అట్టహాసంగా ఏర్పాట్లు ప్రతి ఇంటికి ఓటర్ స్లిప్పులు అందాలి అర్హులైన వారికి కొత్త పింఛన్లు : సర్పంచ్ ఈగ ప్రభాకర్ రెడ్డి నేనెవరినీ బ్లాక్ మెయిల్ చేయడం లేదు..హై కమాండ్ చెప్పినట్టు నడుచుకుంటా .. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన సర్పంచ్ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం - అర్హులైన రేషన్ కార్డు లబ్ధిదారులకు జీవిత బీమా కల్పన అంకత్‌పల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం యువతకు ఉపాధి అవకాశాలతో పాటు స్వయం ఉపాధి, పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా నైపుణ్య శిక్షణ *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* నూతన డీఐఈఓ ప్రభావతికి ఘన సన్మానం ఎమ్మెల్యేల పనితీరుపై బాబు పెదవి విరుపు

నేనెవరినీ బ్లాక్ మెయిల్ చేయడం లేదు..హై కమాండ్ చెప్పినట్టు నడుచుకుంటా ..

Select Suryaa Now
నేనెవరినీ బ్లాక్ మెయిల్ చేయడం లేదు..హై కమాండ్ చెప్పినట్టు నడుచుకుంటా ..
కడప/జమ్మలమడుగు, నవంబర్ 21: ఆంధ్రప్రదేశ్ అధికార కూటమిలో కడప జిల్లా పరిషత్ (జెడ్పీ) ఛైర్మన్ పదవి కేటాయింపు అంశం తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. కడప జెడ్పీ ఛైర్మన్ పీఠం విషయంలో కూటమి నేతలు తనకు ఇచ్చిన మాట తప్పారంటూ జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి పెద్దల తీరుపై తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు.

మంత్రి పదవి కోసం తాను ఎవరినీ బ్లాక్‌మెయిల్ చేయడం లేదని, ఆ పదవిపై తనకు ఎలాంటి ఆసక్తి లేదని ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. అయితే, జెడ్పీ ఛైర్మన్ పదవి విషయంలో జరిగిన పరిణామాల పట్ల తమ కుటుంబ సభ్యులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారని, అందుకే పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ప్రకటించారు. తన తమ్ముళ్ల కుమారులు ఇప్పటికే తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారని వెల్లడించారు.

ఈ అంశంపై తాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లతో స్వయంగా భేటీ అయినప్పటికీ, వారి నుంచి వచ్చిన సమాధానంతో తమకు ఏమాత్రం సంతృప్తి కలగలేదని ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ విషయాన్ని బీజేపీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లామని, ఢిల్లీ పెద్దల నుంచి వచ్చే సమాచారం ఆధారంగా తన తదుపరి రాజకీయ నిర్ణయం ఉంటుందని ఆయన తేల్చిచెప్పారు. ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు కడప జిల్లా కూటమి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.