అంబేద్కర్ అవార్డు గ్రహీత ఎర్పుల ఆనంద్ కు ఘనంగా సన్మానం
చేవెళ్ల : ఈనెల 15 న ఢిల్లీలో అంబేద్కర్ జాతీయ అవార్డు అందుకున్న ఎర్పుల ఆనంద్ ను శనివారం చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలో ని అంబేద్కర్ భవన్ లో పిడిఎస్ యు జిల్లా నాయకులు రాజేష్ ఆధ్వర్యంలో పూలమాల, శాలువలతో ఘనంగా సన్మానించి అభిందించారు. భారత రాజ్యాంగం పైన విద్యార్థులలో, ప్రజలలో అవగాహన కల్పిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా ప్రజలను చైతన్యవంతం చేస్తూ సామాజిక బాధ్యతతో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతూ అందరికీ ఆదర్శంగా నిలిచిన ఆనంద్ ఒక సామాజిక ఉద్యమకారుడుగా మరెన్నో ఉన్నతమైన అవార్డులు అందుకోవాలని దళిత రత్న అవార్డు గ్రహీత ఇటిక్యాల బిక్షపతి,అడ్వకేట్ దామరగిద్ద గోపాల్ గౌడ్,సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్,పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఖానాపురం రాజేష్,న్యాయవిద్య విద్యార్థి ప్రభాస్,మాదారం విషువర్ధన్, అభినందించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ
అదేవిదంగా ఆశయాలను సామజిక కార్యక్రమాల ద్వారా ముందుకు తీసుకెళ్ళి మరింత ఉత్సహంతో పని చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో గూడెపు రాము, ఎద్దుమూతి శ్రీనివాస్, మల్లేష్, నరేష్, తదితరులు ఉన్నారు.