ప్రతి ఇంటికి ఓటర్ స్లిప్పులు అందాలి
బైరెడ్డిపల్లి, గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రతి ఓటరుకూ పోలింగ్ వివరాలు చేరేలా ఓటరు స్లిప్పులను పంపిణీ చేయాలని ఎంపీడీఓ కె. ఆనంద బాబు సూచించారు. శనివారం ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన బీఎల్‌ఓల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “ఒక్క ఇల్లూ మిస్ కావొద్దు.. ఒక్క ఓటరుకూ స్లిప్పు అందకుండా ఉండకూడదు” అని స్పష్టం చేశారు.ఓటు వేయాల్సిన కేంద్రం, వార్డు, ఓటరు జాబితాలో క్రమసంఖ్యను తెలియజేయడంలో ఓటరు స్లిప్పులు కీలకమన్నారు. బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి వివరాలు పరిశీలించి పంపిణీ చేయాలని, తాళం వేసిన ఇళ్లను మరోసారి సందర్శించాలని సూచించారు. అందజేయలేని స్లిప్పులను కారణాలతో నమోదు చేసి సంబంధిత అధికారులకు నివేదించాలని తెలిపారు.సమావేశంలో పాల్గొన్న ఆర్‌ఐ దామోదరం, మరణించినట్లు నిర్ధారణైన ఓటర్ల పేర్లపై స్లిప్పులు పంపిణీ చేయవద్దని సూచించారు. వారి వివరాలను ప్రత్యేకంగా నమోదు చేసి సంబంధిత ఎన్నికల అధికారులకు తెలియజేయాలన్నారు. ప్రతి ఓటరుకూ సరైన సమాచారం అందేలా సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని కోరారు
జ. సుబ్రమరిపోర్టర్, బైరెడ్డిపల్లి సూర్యణ్యం