BREAKING
ప్రతి ఇంటికి ఓటర్ స్లిప్పులు అందాలి అర్హులైన వారికి కొత్త పింఛన్లు : సర్పంచ్ ఈగ ప్రభాకర్ రెడ్డి నేనెవరినీ బ్లాక్ మెయిల్ చేయడం లేదు..హై కమాండ్ చెప్పినట్టు నడుచుకుంటా .. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన సర్పంచ్ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం - అర్హులైన రేషన్ కార్డు లబ్ధిదారులకు జీవిత బీమా కల్పన అంకత్‌పల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం యువతకు ఉపాధి అవకాశాలతో పాటు స్వయం ఉపాధి, పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా నైపుణ్య శిక్షణ *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* నూతన డీఐఈఓ ప్రభావతికి ఘన సన్మానం ఎమ్మెల్యేల పనితీరుపై బాబు పెదవి విరుపు ఐదేళ్లుగా పెంచుకున్న బిడ్డకు దూరమయ్యామంటూ తల్లిదండ్రుల ఆవేదన! చౌటుప్పల్‌లో బీజేపీ మోర్చాల నూతన కమిటీల నియామకం 23 నుంచి ఎస్కే యూనివర్సిటీ అంతర్ కళాశాలల క్రికెట్ టోర్నమెంట్ రూ.10 వేల లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి పట్టుబాటు వైఎస్ఆర్సిపి నాయకుడిపై హత్యాయత్నం-తీవ్రంగా ఖండించిన మాజీ ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి రెడ్డి ఎడ్లబండ్ల నుంచి బుల్లెట్ రైళ్ల వరకు.. దేశ ప్రగతిలో తొలి ఐఐటీది కీలక పాత్ర

యువతకు ఉపాధి అవకాశాలతో పాటు స్వయం ఉపాధి, పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా నైపుణ్య శిక్షణ *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

Select Suryaa Now
యువతకు ఉపాధి అవకాశాలతో పాటు స్వయం ఉపాధి, పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా నైపుణ్య శిక్షణ   *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

 

కర్నూలు, నవంబర్ 21:- జిల్లాలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు స్వయం ఉపాధి పొందుతూ పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా నైపుణ్య శిక్షణ, అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు.

శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా అందిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. నిర్ణీత గడువు (SLA) దాటే అవకాశం ఉన్న దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.  అమరరాజా బ్యాటరీస్ సంస్థ ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో భాగంగా  జిల్లాలో సుమారు వెయ్యి మంది యువతకు శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.  ప్రస్తుతం  41 మంది ఈ సంస్థలో చేరారన్నారు.  శిక్షణ సమయంలో కూడా నెలకు రూ.18 వేల స్టైఫండ్ అందించే అవకాశం ఉన్నందున యువతలో ఈ అంశంపై  అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.. యువతలో ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందించి, పరిశ్రమల్లో అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా వారిని ప్రోత్సహించాలని కలెక్టర్  సంబంధిత అధికారులను ఆదేశించారు... ప్రధానంగా ప్రభుత్వ గ్రామీణ ప్రాంతాల యువతకు ఉపాధి అవకాశాలపై ప్రత్యేక అవగాహన కల్పించాలని, ఉద్యోగాల కోసం ఆసక్తి చూపుతున్న యువతను గుర్తించి సంబంధిత సంస్థల వద్దకు పంపించాలని కలెక్టర్ సూచించారు. శిక్షణ మధ్యలోనే మానేయకుండా, ఉద్యోగాల్లో స్థిరపడేలా యువతకు కౌన్సెలింగ్ ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు.

రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ MSME పెర్ఫార్మెన్స్ (ర్యాంప్) కార్యక్రమంలో భాగంగా ఉద్యమ్ రిజిస్ట్రేషన్, మేధో సంపత్తి హక్కులు, జెడ్ సర్టిఫికేషన్ తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించే విధంగా  చర్యలు తీసుకోవాలన్నారు. కేవలం కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా వాటి ద్వారా సాధించిన ఫలితాలను కూడా స్పష్టంగా నివేదించాలన్నారు. ఉద్యమ్ రిజిస్ట్రేషన్ వర్క్‌షాపులు, ర్యాంప్ కార్యక్రమాల ద్వారా ఎంతమంది లబ్ధి పొందారు, ఎంతమంది పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ముందుకు వచ్చారనే వివరాలతో నివేదికలు సమర్పించాలని కలెక్టర్  సంబంధిత అధికారులను ఆదేశించారు.

జిల్లాలో  మహిళా పారిశ్రామికవేత్తలకు మార్కెట్ అవకాశాలను కల్పించేందుకు అమెజాన్ సహేలీ సంస్థతో కలిసి వెండర్ డెవలప్‌మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమావేశంలో టాటా కంపెనీ సిబ్బంది కలెక్టర్ దృష్టికి  తీసుకొని రాగా,  డీఆర్‌డీఏ, మెప్మా పరిధిలో ఉన్న మహిళా పారిశ్రామికవేత్తల వివరాలను వారం రోజుల్లో సేకరించి, జీఎస్టీ, ఉద్యమ్ రిజిస్ట్రేషన్లు కలిగిన వారి జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్  డిఆర్డిఏ పిడి ని ఆదేశించారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల్లో వ్యాపార రంగంలో ఆసక్తి, అర్హత కలిగిన వారిని గుర్తించి ప్రోత్సహించాలన్నారు.. అదే విధంగా మ్యాజిక్ బస్ ఫౌండేషన్‌తో సమన్వయం చేసుకుని యువతకు అవసరమైన శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు భవిష్యత్తులో ఎంచుకోదగిన కెరీర్ అవకాశాలపై అవగాహన కల్పించాలని, వ్యాపారం, పారిశ్రామిక రంగాన్ని కూడా ఒక కెరీర్ అవకాశంగా పరిచయం చేయాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఈ కార్యక్రమాల అమలుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, వ్యాపార రంగంపై అవగాహన కలిగిన సిబ్బందిని గుర్తించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు..

జిల్లాలో వివిధ పారిశ్రామిక సంస్థలకు కేటాయించిన ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, భూముల కేటాయింపు, భూముల అప్పగింత ప్రక్రియలను వేగవంతం చేయాలని  కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎంఎస్ఎంఈ పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, ప్లాట్ల కేటాయింపు, మౌలిక వసతుల పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని  కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

సమావేశంలో  పరిశ్రమల శాఖ జిఎం సంజీవ రాజు,  ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి, కర్నూలు మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, మార్కెటింగ్ ఏడి నారాయణమూర్తి, నెడ్ క్యాప్ అధికారి వీరేంద్ర, వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, డిఆర్డిఏ పిడి శ్రీధర్ రావు, ఉపాధి కల్పన అధికారి దీప్తి, ఎల్డిఎం మోహన్, డి టి సి శాంత కుమారి, ఎస్సీ ఎస్టీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రాజామహేంద్రనాథ్ , ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ రెడ్డి, ఐలా చైర్మన్ రామకృష్ణా రెడ్డి, జిల్లా దళిత్ ఇండస్ట్రీస్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిలీప్ కుమార్,  ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు..