రూ.10 వేల లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి పట్టుబాటు
సూర్య కరీంనగర్:కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి లావుడ్య చవన్ లాల్ రూ.10 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. శనివారం (21వ తేదీ) ఫిర్యాదుదారుడి ఇంటి వద్ద లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్నారు. ఫిర్యాదుదారుడి కోడలికి 'టీजी చేయూత వితంతు పెన్షన్' దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసి పెన్షన్ మంజూరు చేయించినందుకు ప్రతిఫలంగా లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ వెల్లడించింది. లంచం సొమ్ము రూ.10 వేలు నిందితుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపింది. కేసు దర్యాప్తులో ఉంది.
లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.