ఇక తగ్గేదే లే... ఎన్నికల వరకే మీ ఆరోపణలు
విజయనగరం బ్యూరో మేజర్ న్యూస్: రాజకీయ ఆరోపణలు ఎన్నికల వారికేనని ఇక మా సత్తా ఏంటో చూపిస్తామని మాజీ జడ్పి చైర్మన్, అరకు పార్లమెంటు ఇంచార్జ్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ద్వజమెత్తారు. శనివారం అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో కూటమి కైవసం చేసుకుని జిల్లాలో జెడ్పీ, కార్పొరేషన్, మున్సిపల్ లో విజయకేతనం ఎగురవేసిందన్నారు.ప్రమాణాలు అన్ని పూర్తి అయ్యాయనీ, సర్పంచ్ లు అవుతున్నాయనీ చంద్రబాబు, పవన్, లోకేష్ నాయకత్వం...జిల్లా పార్టీ అధ్యక్షులు నాగార్జున ఆధ్వర్యంలో అన్ని గెలుచుకున్నాం అని అందరి సమిష్టి కృషితో, కార్యకర్తలు అందరి సమన్వయంతో గెలిచాం అన్నారు.ఈగెలుపు మరింత బాధ్యత పెరిగిందన్నారు. ఎన్నికల్లో ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు , పోలీసు కేసు నమోదు కాలేదనీ ,పనులు కోసం వెళ్లిన వారు ఓటింగ్ లో పాల్గొన్నారన్నారు.ప్రజలందరి లో ఆలోచన వచ్చిందనీ ఈ ప్రభుత్వం అండగా ఉండాలని ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ జరిగిందన్నారు.2029 లో కూడా వచ్చేది కూటమి ప్రభుత్వమే అన్నారు. ప్రతిపక్ష పార్టీ ఏదో జరగనిది జరిగినట్టు ఓటమి తట్టుకోలేక మాట్లాడుతున్నారన్నారు. ప్రజాస్వామ్యం బద్దంగా ఎన్నికలు జ రిగాయనీ బాధ్యతగా మంచి పాలన అందిస్తాం అన్నారు.పూసపాటి రేగ లో బి ఫారం జాప్యం వల్ల ఇబ్బంది జరిగితే మీరు చేసే కార్యక్రమం సమంజసం గా లేదన్నారు. బీసీలు అణగదొక్కరని మాట్లాడుతున్నారని. .టీడీపి పార్టీ స్వర్గీయ ఎన్టీఆర్ పార్టీని స్థాపించి బీసీలకు పెద్ద పీట వేశారనీ,33 శాతాన్ని 50 శాతం చేశారనీ సుప్రీం కోర్టు కు వెళ్ళినా పార్టీ పరంగా ఇచ్చారన్నారు.నగర పాలక సంస్థలో మీకు బీసీలు లేరా అన్నింటికి మీరే పోటీ చేస్తారు బొబ్బిలి లో బీసీలు లేరా మాటలకే బిసిలు అన్నారు.ఎన్నికల ముందు రాజకీయ ఆరోపణలు గా చూస్తాం ఇక అలగ ఉండదు... చట్టాలు పై న్యాయస్థానం పై మీకు నమ్మకం లేదనీ బీసీలను జెడ్పీ చైర్మన్ చేసి మహిళ లకి అవకాశం ఇచ్చి మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాజకీయ ఆరోపణలు ఎన్నికల వరకే నని అబద్ధాన్ని పది సార్లు చెబితే నిజం కాదనీ 29 లో కూటమి అధికారంలోకి వచ్చేలా పనిచేస్తాం...మీ తప్పుడు మాటలు ఎవ్వరూ నమ్మరనీ, వైసీపీ కార్యకర్తల్లో ఆలోచన వచ్చిందనీ కొద్ది రోజుల్లో అన్ని చూస్తారన్నారు. కిమిడి నాగార్జున మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో వైసీపీ చిత్తు గా ఓడి రకరకాలుగా మాట్లాడుతున్నారన్నారు.బొత్స మాటలు విడ్డూరంగా ఉన్నాయనీ,ప్రభుత్వానికి పాలించే హక్కు లేదనీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు మేమే అలాంటి రాజకీయాలు. చేస్తే మీరు నామినేషన్ వేసేవారా గతంలో 21 లో ఎన్నికెలు ఎలా జరిగాయో తెలుసు అన్నారు. పూసపాటిరేగ లో వైసీపీ 8 వస్తె ఎలా వైస్ అవుతారనీ, 2006 లో బై లెక్షన్ లో150 ఓట్ల తేడాతో ఎలా గెలిచారో అందరికీ తెలుసు అన్నారు.సోషల్ మీడియాలో భువనేశ్వరి ని లాగడం ఎప్పుడైనా మీకోసం తప్పుగా మాట్లాడామా మీ వ్యక్తిత్వం కోసం మాట్లాడామా మంత్రి గురించి ఏదైనా అంటే ఎవరైనా స్పందిస్తారు ఇబ్బంది కర ట్రోలింగ్ చేస్తే మేమే చర్యలు తీసుకుంటామని వై ఎస్ భారతి పై ఒక టీడీపి కార్యకర్త ట్రోల్ చేస్తే లోకేష్ కేసు పెట్టించారన్నారు. హుందాగా రాజకీయాలు చేసుకుందాం గవర్నర్ కలుస్తాను అంటున్నారు గవర్నర్ కు గతంలో కంటే చంద్రబాబ బాగా స్థానిక ఎన్నికలు నిర్వహించారని కితాబు ఇచ్చి మీ గౌరవాన్ని కాపాడుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు పలువురు నాయకులు పాల్గొన్నారు.