BREAKING
వైఎస్ఆర్సిపి నాయకుడిపై హత్యాయత్నం-తీవ్రంగా ఖండించిన మాజీ ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి రెడ్డి ఎడ్లబండ్ల నుంచి బుల్లెట్ రైళ్ల వరకు.. దేశ ప్రగతిలో తొలి ఐఐటీది కీలక పాత్ర నకిలీ విత్తనాల విక్రయాలు, అక్రమ రవాణా నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు ఎస్పీ సిరమ్మ ఆన్ డ్యూటీ మున్సిపల్ ఎన్నికల్లో 94% స్ట్రయిక్ రేట్ సాధించాం.. ఇక తగ్గేదే లే... ఎన్నికల వరకే మీ ఆరోపణలు నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ.. కల్లమల్లలో లాఠీఛార్జ్ తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఆఫీసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ధర్నా న్యూయార్క్‌లో రోడ్డు ప్రమాదం: నల్గొండ జిల్లా యువకుడి దుర్మరణం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్లు మంజూరు హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నియంత్రణలో వికారాబాద్ జిల్లాకు జాతీయ గుర్తింపు తొలి టెస్టులో భారత్ జోరు 2022 వ్యయ బిల్లు ఆమోదంపై కోర్టు తీర్పు గాంధీ భవన్‌లో రక్తదానం చేసిన ఫిషరీస్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రశాంత్

సిరమ్మ ఆన్ డ్యూటీ

Select Suryaa Now
సిరమ్మ ఆన్ డ్యూటీ

విజయనగరం బ్యూరో మేజర్ న్యూస్:
విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి మజ్జి సిరి సహస్ర (సిరమ్మ)  శనివారం రెండవ రోజు జిల్లా పరిషత్ కార్యాలయంలో అడుగుపెట్టి, తన ఛాంబర్‌లో ఆసీనులయ్యారు. తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంటరీ పరిశీలకులు మరియు ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ గౌరవనీయులు  మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)  కుమార్తె అయిన సిరి సహస్ర  రాకతో జెడ్పీ కార్యాలయ ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది.
రెండో రోజు విధులకు హాజరైన జెడ్పీ చైర్మన్‌ను కలిసేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజాప్రతినిధులు, స్థానిక ముఖ్య నాయకులు మరియు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా వారంతా సిరి సహస్ర ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్యాలయానికి విచ్చేసిన నాయకులు, ప్రజాప్రతినిధులను చైర్మన్ సిరి సహస్ర గారు ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా అందరి సహకారంతో ముందుకు సాగుతామని ఈ సందర్భంగా ఆమె ఆకాంక్షించారు.