BREAKING
వైఎస్ఆర్సిపి నాయకుడిపై హత్యాయత్నం-తీవ్రంగా ఖండించిన మాజీ ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి రెడ్డి ఎడ్లబండ్ల నుంచి బుల్లెట్ రైళ్ల వరకు.. దేశ ప్రగతిలో తొలి ఐఐటీది కీలక పాత్ర నకిలీ విత్తనాల విక్రయాలు, అక్రమ రవాణా నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు ఎస్పీ సిరమ్మ ఆన్ డ్యూటీ మున్సిపల్ ఎన్నికల్లో 94% స్ట్రయిక్ రేట్ సాధించాం.. ఇక తగ్గేదే లే... ఎన్నికల వరకే మీ ఆరోపణలు నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ.. కల్లమల్లలో లాఠీఛార్జ్ తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఆఫీసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ధర్నా న్యూయార్క్‌లో రోడ్డు ప్రమాదం: నల్గొండ జిల్లా యువకుడి దుర్మరణం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్లు మంజూరు హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నియంత్రణలో వికారాబాద్ జిల్లాకు జాతీయ గుర్తింపు తొలి టెస్టులో భారత్ జోరు 2022 వ్యయ బిల్లు ఆమోదంపై కోర్టు తీర్పు గాంధీ భవన్‌లో రక్తదానం చేసిన ఫిషరీస్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రశాంత్

నకిలీ విత్తనాల విక్రయాలు, అక్రమ రవాణా నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు ఎస్పీ

Select Suryaa Now
నకిలీ విత్తనాల విక్రయాలు, అక్రమ రవాణా నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు ఎస్పీ

రాజన్న సిరిసిల్ల జిల్లా..
జిల్లాలో నకిలీ విత్తనాలు, నాణ్యత లేని ఎరువుల విక్రయాలు, అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీస్, వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.జిల్లాలో నకిలీ విత్తనాలను విక్రయించినా, అక్రమంగా రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని, తరచూ ఇటువంటి కేసుల్లో పట్టుబడే వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.శనివారం రోజున పోలీస్ , వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణాల్లోని స్టాక్ రిజిస్టర్లు, విక్రయ రికార్డులు, లైసెన్సులు, ఎరువులు, విత్తనాల నిల్వలు, బిల్లులు, రసీదులను క్షుణ్ణంగా పరిశీలించారు.ఈసందర్భంగా ఎస్పీ   మాట్లాడుతూ.. జిల్లాలో నకిలీ విత్తనాల అక్రమ రవాణా, విక్రయాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో నకిలీ విత్తనాల విక్రయాలకు పాల్పడిన వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
జిల్లాలో ఒక్క రైతు కూడా నకిలీ విత్తనాలతో మోసపోకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులపై ఉందని, జిల్లాలోని ఫర్టిలైజర్, సీడ్స్ షాపులపై నిరంతరం నిఘా ఉంచి నకిలీ విత్తనాలు, నాణ్యత లేని ఎరువుల విక్రయాలు, అక్రమ రవాణాను అరికట్టేందుకు కృషి చేస్తున్నన్నారు.
ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రైతులు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, నాణ్యతపై అనుమానం ఉన్నా లేదా ఎవరైనా నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుమందులు విక్రయిస్తున్నట్లు సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు తెలియజేయాలని జిల్లా ప్రజలకు, రైతులకు సూచించారు.రైతులను నకిలీ విత్తనాలు, నాణ్యత లేని ఎరువుల బారి నుంచి రక్షించేందుకు జిల్లా పోలీస్, వ్యవసాయ శాఖ సమన్వయంతో నిరంతరం తనిఖీలు కొనసాగిస్తాయని తెలిపారు.ఈతనిఖీల్లో  పోలీస్ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.