చౌటుప్పల్‌లో బీజేపీ మోర్చాల నూతన కమిటీల నియామకం
మండల పార్టీ అదనపు ప్రధాన కార్యదర్శిగా బర్మా నాగరాణి
చౌటుప్పల్,మేజర్ న్యూస్: మండల పరిధి కొయ్యలగూడెం రిక్కల సత్తిరెడ్డి ఫంక్షన్ హాల్‌లో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షుడు కైరంకొండ అశోక్ నేత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ మోర్చాలకు నూతన అధ్యక్షులను నియమించి నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు అశోక్ నేత మాట్లాడుతూ పార్టీ బలోపేతమే లక్ష్యంగా అన్ని మోర్చాల నాయకులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను గ్రామస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన నాయకులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.
నూతన నియామకాలలో ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడిగా చీమకండ్ల మధు, ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా కరెంటోత్ భాస్కర్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా నాతి సురేష్ గౌడ్, మహిళా మోర్చా అధ్యక్షురాలిగా రేవెల్లి స్వప్న, యువ మోర్చా అధ్యక్షుడిగా అల్మాసిపేట గౌతమ్, కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా మునగాల అమరేందర్ రెడ్డి, మైనారిటీ మోర్చా అధ్యక్షుడిగా షేక్ మదర్‌ను, కార్మిక విభాగం మండల కన్వీనర్ నందగిరి రమేష్ గౌడ్ ను నియమించారు. అదేవిధంగా మండల పార్టీ కమిటీ అదనపు ప్రధాన కార్యదర్శిగా బర్మా నాగరాణిని నియమించారు.
అనంతరం నూతనంగా నియమితులైన నాయకులకు నియామక పత్రాలను అందజేసి అభినందించారు.కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రమణగుని శంకర్ మందుల గూడెం సర్పంచ్ తంగెళ్ల వెంకటేశం గుండ్ల బావి సర్పంచ్ నందగిరి వెంకటేశం కంది లక్ష్మారెడ్డి ధర్మాజీ ఉపసర్పంచ్ ఫకీరు శ్రీనివాస్ రెడ్డి పోట్టబత్తిని బాలరత్నం ఎన్నంపల్లి శ్రీకాంత్ రెడ్డి , యస అశోక్ రెడ్డి పబ్బతి శేఖర్ గౌడ్ బర్మా నాగరాణి పల్లె వెంకటేశం రాధారపు సత్తయ్య పక్కిర్ లింగారెడ్డి అల్మాస్ పేట గౌతమ్ నాటి సురేష్ మునగాల అమరేందర్ రెడ్డికొయ్యాడ స్వామి జాల మల్లేష్ గునుగంటి స్వామి చౌట దేవేందర్ పదసగోని శ్రీశైలం మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు