నూతన డీఐఈఓ ప్రభావతికి ఘన సన్మానం
సూర్య రాజంపేట : కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారిగా (డీఐఈఓ) నూతనంగా నియమితులైన ప్రభావతి ను గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ (GLAT) సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసి, పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ బాధ్యతలను చేపట్టిన ప్రభావతి ఆధ్వర్యంలో జిల్లాలో ఇంటర్మీడియట్ విద్య మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రత్యేక కృషి చేయాలని కోరారు. అదేవిధంగా అధ్యాపకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, విద్యారంగ అభివృద్ధికి తమ అసోసియేషన్ తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ చైతన్య, కోశాధికారి ముద్దాపురం నవీన్‌తో పాటు అసోసియేషన్‌కు చెందిన పలువురు సభ్యులు పాల్గొన్నారు.