వెల్దుర్తి మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా టీవీ రమేష్ నామినేషన్
వెల్దుర్తి, మేజర్ న్యూస్: వెల్దుర్తి మేజర్ పంచాయతీ సర్పంచ్ పదవికి అభ్యర్థిగా టీవీ రమేష్ శనివారం తన నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన అనుచరులు, మద్దతుదారులతో కలిసి వెళ్లి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తాను బరిలోకి దిగుతున్నట్లు తెలిపారు. తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపిస్తే వెల్దుర్తి పంచాయతీని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.