BREAKING
రేపు హైదరాబాద్‌కు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ సందీప్.. బస్సుల రాకపోకలకు అంతరాయం.. ప్రయాణికులకు ఇబ్బందులు మల్లాం మాజీ సర్పంచ్ దువ్వూరు శేషు రెడ్డికి ఎంపీ గురుమూర్తి,మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నివాళి ముదిరాజుల హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలి ఆదిభట్ల ఏసీపీ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత.. ఘనంగా కొక్కిరాల సురేఖమ్మ జన్మదిన సంబరాలు వెల్దుర్తి మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా టీవీ రమేష్ నామినేషన్ అంబేద్కర్ అవార్డు గ్రహీత ఎర్పుల ఆనంద్ కు ఘనంగా సన్మానం నిజామాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర రద్దు.. సేవే లక్ష్యం గ్రామ అభివృద్దే నా ధ్యేయం శంకరాపురం సర్పంచ్ టిడిపి అభ్యర్థి పూర్ణచంద్రరావు సాగునీరు అందించి పంటలు కాపాడండి. ఆర్ కృష్ణాపురం రైతుల వినతి అనంతపురం మేయర్‌గా రమేష్ గౌడ్ ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్.. అట్టహాసంగా ఏర్పాట్లు ప్రతి ఇంటికి ఓటర్ స్లిప్పులు అందాలి అర్హులైన వారికి కొత్త పింఛన్లు : సర్పంచ్ ఈగ ప్రభాకర్ రెడ్డి నేనెవరినీ బ్లాక్ మెయిల్ చేయడం లేదు..హై కమాండ్ చెప్పినట్టు నడుచుకుంటా ..

ఘనంగా కొక్కిరాల సురేఖమ్మ జన్మదిన సంబరాలు

Select Suryaa Now
ఘనంగా కొక్కిరాల సురేఖమ్మ జన్మదిన సంబరాలు

 

సూర్య, నస్పూర్ : మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖమ్మ జన్మదిన వేడుకలను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. మేయర్ దర్ని మధుకర్, సుజాత దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో స్థానిక ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సురేఖమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ తరఫున సురేఖమ్మకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవకు అంకితమైన నాయకురాలిగా, పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొన్న సురేఖమ్మ సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ఆమె ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాచకొండ గోపాల్‌రావు, ఖలీద్, కొండ్ర రాజేశ్వరి, లింగయ్య, డివిజన్ అధ్యక్షుడు గోపతి తిరుపతి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పిట్టల రవి, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.