మల్లాం మాజీ సర్పంచ్ దువ్వూరు శేషు రెడ్డికి ఎంపీ గురుమూర్తి,మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నివాళి
చిట్టమూరు మేజర్ న్యూస్
తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లాం గ్రామ మాజీ సర్పంచ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దువ్వూరు శేషు రెడ్డి శుక్రవారం సాయంత్రం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.శనివారం ఆయన భౌతికకాయాన్ని సందర్శించిన తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిట్టమూరు మండల కన్వీనర్ సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి,జిల్లా సంయుక్త కార్యదర్శి కామిరెడ్డి కస్తూరి రెడ్డి,నాయకులు గొట్టికాటి రవీంద్రారెడ్డి, చెన్నారెడ్డి బాబు రెడ్డి,ఎస్కె మాభాషా తదితర మండల నాయకులు పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.దువ్వూరు శేషు రెడ్డి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ,ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రజాజీవితంలో తనదైన గుర్తింపు సంపాదించుకున్న శేషు రెడ్డి మృతి ఈ ప్రాంత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ప్రజానీకానికి, ముఖ్యంగా పేదలకు తీరని లోటన్నారు.ప్రజా జీవితంలో ఉంటూ పేదలకు,సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించిన ఆయన మరణం బాధాకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ,కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు
అంపల్లి మురళి చిట్టమూరు మేజర్ న్యూస్