BREAKING
అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త.. రేపు హైదరాబాద్‌కు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ సందీప్.. బస్సుల రాకపోకలకు అంతరాయం.. ప్రయాణికులకు ఇబ్బందులు మల్లాం మాజీ సర్పంచ్ దువ్వూరు శేషు రెడ్డికి ఎంపీ గురుమూర్తి,మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నివాళి ముదిరాజుల హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలి ఆదిభట్ల ఏసీపీ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత.. ఘనంగా కొక్కిరాల సురేఖమ్మ జన్మదిన సంబరాలు వెల్దుర్తి మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా టీవీ రమేష్ నామినేషన్ అంబేద్కర్ అవార్డు గ్రహీత ఎర్పుల ఆనంద్ కు ఘనంగా సన్మానం నిజామాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర రద్దు.. సేవే లక్ష్యం గ్రామ అభివృద్దే నా ధ్యేయం శంకరాపురం సర్పంచ్ టిడిపి అభ్యర్థి పూర్ణచంద్రరావు సాగునీరు అందించి పంటలు కాపాడండి. ఆర్ కృష్ణాపురం రైతుల వినతి అనంతపురం మేయర్‌గా రమేష్ గౌడ్ ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్.. అట్టహాసంగా ఏర్పాట్లు ప్రతి ఇంటికి ఓటర్ స్లిప్పులు అందాలి అర్హులైన వారికి కొత్త పింఛన్లు : సర్పంచ్ ఈగ ప్రభాకర్ రెడ్డి

ముదిరాజుల హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలి

Select Suryaa Now
ముదిరాజుల హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలి

 

మంచాల, మేజర్ న్యూస్ : ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నోముల గ్రామంలో మత్స్యకారుల సహకార సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు చింతకింది చక్రపాణి ముదిరాజ్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముదిరాజుల ఐక్యత, జాతి మనుగడ, హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ముదిరాజ్ కులస్తులను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ముదిరాజులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు గుండ్ల కృష్ణ, చింతకింది జంగయ్య, గంట హనుమంతు, గంట చిన్నకృష్ణ, వార్డు సభ్యులు చింతకింది స్వాతి దర్శన్,  గంట శ్రీకాంత్, గంట మహేందర్, గంట అనిల్, చింతకింది చిన్న నర్సింహ, మావిళ్ల గాలయ్య తదితరులు పాల్గొన్నారు.

✍️ఎర్ర లింగం, మేజర్ న్యూస్ మంచాల, రంగారెడ్డి జిల్లా.