telangana
ఆదిభట్ల ఏసీపీ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత..
హైదరాబాద్/ఆదిభట్ల, నవంబర్ 21: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల ఏసీపీ కార్యాలయం ఎదుట శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయ్యప్ప మాలధారిపై ఏసీపీ ప్రదీప్ దాడి చేశారని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతలు ఆందోళనకు దిగారు.
పోలీసుల తీరుకు నిరసనగా అయ్యప్ప భక్తులకు మద్దతుగా నిలిచిన బీజేపీ శ్రేణులు ఏసీపీ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బాధ్యుడైన ఏసీపీ ప్రదీప్‌పై తక్షణమే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ ఆందోళనతో ఆదిభట్ల ఏసీపీ కార్యాలయ పరిసరాల్లో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకోగా, పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.