రీ సర్వే పై గ్రామ ప్రజలకు ఎలాంటి అపోహలు వద్దని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ గ్రామ ప్రజలకు సూచించారు
టెేక్మల్; మండల్ లోని ఏ క్లాస్ పూర్ గ్రామంలో నిర్వహించిన భూభారతి భూముల రీ సర్వే గ్రామసభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. మీ గ్రామంలో నిర్వహించబోయే భూభారతి రి సర్వే గురించి ఎలాంటి అపోహలు వద్దన్నారు. రీ సర్వే వల్ల గ్రామంలోని భూములకు పటిష్టంగా హద్దులు నిర్ణయించబడుతుందన్నారు. గ్రామంలో ఉన్న 718 ఎకరాల్లో సర్వే నిర్వహించి ఎలాంటి భూ సమస్యలు ఉన్న 60 రోజుల ముందు నోటీసులు ఇచ్చి పరిష్కరిస్తామని గ్రామస్తులకు తెలిపారు. ముందుగా గ్రామ సరిహద్దులు , గ్రామకంఠం, ఫారెస్ట్, అసైన్డ్, చెరువు,కుంట భూముల అనంతరం పట్టా భూములను సర్వే నిర్వహించి భూ తగాధాలు లేకుండా తీర్చిదిద్దుతామన్నారు. రైతుల భూ సమస్యల పరిష్కారానికి రి సర్వే మంచి కార్యక్రమం అని తెలిపారు. స్థానిక ప్రజల సహకారంతో గ్రామంలో ఉన్న భూమిని రీసర్వే నిర్వహించి రైతులకు అండగా ఉంటామన్నారు.ఏ,డి సర్వే కిషన్ మాట్లాడుతూ.. గ్రామంలో వారం రోజుల్లో ఈ సర్వే ను ప్రారంభిస్తామని, ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలకాలన్నారు. ప్రతి భూకమతానికి పక్కాగా హద్దులు నిర్ధారించడానికి రీసర్వే అన్నారు.ఆర్ డి వో రమాదేవి మాట్లాడుతూ.. రీ సర్వే గురించి ఎలాంటి సమస్యలున్న అధికారులు పరిష్కరిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్, తులసీరామ్ సర్పంచ్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.