BREAKING
చిరువ్యాపారుల కోసం రాహుల్ గాంధీ ర్యాలీ వాయిదాకు బీజేపీ డిమాండ్! రామాయణ కొత్త పాటపై నెటిజన్ల ఫైర్.. డబ్బింగ్ ఫీలింగ్ వస్తోందంటూ కామెంట్స్! 30వ వార్డులో మహబూబ్ భాష ఎన్నికల ప్రచారం బంగాళాఖాతంలో వాయుగుండం: అక్టోబర్ 28న ఏపీ తీరం దాటే తుపాను.. 9 పోర్టుల్లో ఒకటో నంబర్ హెచ్చరిక! పసిడి ప్రేమికులకు షాక్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి రేట్లు ఇవే వర్షంలోనూ రాజ్యలక్ష్మి విస్తృత ప్రచారం ఆపరేషన్ ట్రైడెంట్‌తో డ్రగ్ సిండికేట్‌పై కేంద్రం పంజా: రూ.100 కోట్ల హవాలా గుట్టురట్టు, 18 మంది అరెస్ట్! ఇస్రో ప్రైవేటీకరణ లేదు: పూర్తి ప్రభుత్వ అధీనంలోనే ఉంటుందన్న ఛైర్మన్ వి. నారాయణన్! తాగునీటి పైప్‌లైన్‌కు యుద్ధపాతిపదికన మరమ్మతులు సౌదీకి ఎయిర్ ఇండియా విమానాలు రద్దు: రియాద్, దమ్మామ్ సర్వీసులపై ఎఫెక్ట్! పాకిస్తాన్‌లో గ్యాస్ సంక్షోభం.. ఇరాన్ సరిహద్దుల మూసివేతతో రూ.7,000కు చేరిన ఎల్పీజీ సిలిండర్ ధర.. వోల్వో కార్స్‌లో మరో 2,500 మందికి ఉద్వాసన: వ్యయ నియంత్రణే లక్ష్యం! 17 ఏళ్ల నాటి 'ది గ్యారేజ్'కు మైక్రోసాఫ్ట్ గుడ్‌బై: ఏఐ వైపు భారీగా నిధులు! దేశంలో రూ.100 లక్షల కోట్ల కేపెక్స్: 87% వృద్ధికి ఆ రెండు రంగాలే కీలకం! పెట్రోల్ ధరకే ఈ20: ఆహార ఆర్థిక వ్యవస్థకు ఎందుకు సెగ?

అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు వర్షాలే!

Select Suryaa Now
అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు వర్షాలే!

అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాల జోరు కొనసాగుతోంది. ఏపీ, తెలంగాణలో రానున్న రెండు రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి వాతావరణంపై ప్రభావం చూపుతోంది. మరోవైపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో సోమవారం వరకు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. పిడుగులు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంగళవారం కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కొనసాగవచ్చని, గాలుల వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని అంచనా. రాయలసీమలోనూ సోమ, మంగళవారాల్లో చెదురుమదురు వర్షాలు, ఈదురుగాలులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. వర్షాలతో పాటు కొన్ని చోట్ల వేడి, తేమ కారణంగా అసౌకర్యకర వాతావరణం ఏర్పడొచ్చని అధికారులు పేర్కొన్నారు.

తెలంగాణలోనూ వర్ష సూచన కొనసాగుతోంది. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, ఈదురుగాలులు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్, మేడ్చల్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఉన్నట్లు సమాచారం. మరో 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో వాహనదారులు, ప్రజలు జాగ్రత్తగా ఉండటం మంచిది. ముఖ్యంగా ఉరుములు, మెరుపుల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడకుండా సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని సూచిస్తున్నారు.