BREAKING
చాక్లెట్ల ధరల పెంపు వ్యూహం బెడిసికొట్టింది, అంగీకరించిన లిండ్ట్ సంస్థ చైర్మన్ బ్రిటన్ నూతన బడ్జెట్ ప్రకటనకు వేళాయే అక్టోబర్ 30న థియేటర్లలోకి యోగిబాబు సింగారం.. ఘనంగా ఆడియో వేడుక! అమెరికాలో అడి సంస్థ నూతన తయారీ కేంద్రం ఎంజీఆర్, జయలలిత బాటలోనే జోసెఫ్ విజయ్.. సినీ రంగం నుంచి సీఎం కావడం గర్వకారణం: నటుడు అజయ్ రత్నం ప్రశంసల జల్లు! మునుగోడు ఎమ్మెల్యే మూడేళ్ల కృషి ఫలితమే ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం: కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మందుల బీరప్ప పండుగకు ఊరెళ్లిన కుటుంబం.. ఇంట్లో భారీ చోరీ:నాలుగు కిలోల వెండి, తులం బంగారం, రూ.25 వేల నగదు అపహరణ బిగ్ బాస్ హౌస్‌లో నరేష్‌కు అరుదైన అవకాశం.. నాగార్జున ప్రశంసల జల్లు! అమెరికాలోని ఫ్లోరిడాలో కాల్పుల కలకలం, పన్నెండు మందికి పైగా తీవ్ర గాయాలు లక్నోలో హైకోర్టు ఆదేశాలతో 200కు పైగా లాయర్ల ఛాంబర్ల కూల్చివేతకు రంగం సిద్ధం: మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయంపై న్యాయవాదుల భగ్గు.. రాంచీలో రెండో రోజు కొనసాగుతున్న బీజేపీ కార్యవర్గ భేటీ: ఎన్నికల వ్యూహాలు, ప్రభుత్వ వైఫల్యాలపై విస్తృత మథనం.. కీలక రాజకీయ తీర్మానాలు! లిస్బన్‌లో నిరసనకారుల క్యాంప్‌ను ఖాళీ చేయించిన పోర్చుగల్ పోలీసులు కొత్త బంగారు లోకం హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ సినీ ప్రయాణంపై ఆసక్తికర విశేషాలు! నవంబర్ 7 నుంచి మూడు రోజుల పాటు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.! అదరగొడుతున్న కీర్తి సురేష్ అకా ట్రైలర్.. డిజిటల్ వరల్డ్‌లో వైవిధ్యమైన పాత్రతో అలరించనున్న బ్యూటీ!

పాకిస్తాన్‌లో గ్యాస్ సంక్షోభం.. ఇరాన్ సరిహద్దుల మూసివేతతో రూ.7,000కు చేరిన ఎల్పీజీ సిలిండర్ ధర..

Select Suryaa Now
 పాకిస్తాన్‌లో గ్యాస్ సంక్షోభం.. ఇరాన్ సరిహద్దుల మూసివేతతో రూ.7,000కు చేరిన ఎల్పీజీ సిలిండర్ ధర..

                                          నిలిచిపోయిన సరఫరా.. విలవిల్లాడుతున్న సామాన్యులు!
సూర్య ఇంటర్నేషనల్ డెస్క్, ఇస్లామాబాద్: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌లో గృహావసర ఇంధన కొరత పరాకాష్టకు చేరింది. ఇరాన్‌తో ఉన్న సరిహద్దు క్రాసింగ్‌లను మూసివేయడంతో పాక్‌లో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో బహిరంగ మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడి, కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే 11.8 కిలోల గృహోపయోగ ఎల్పీజీ సిలిండర్ ధర రికార్డు స్థాయిలో రూ.7,000కు ఎగబాకింది. సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి మరింత దయనీయంగా మారి, పలు చోట్ల బ్లాక్ మార్కెట్లో సిలిండర్ ధర రూ.7,500 నుంచి రూ.8,000 దాకా పలుకుతోంది.

రోజువారీ 7,000 టన్నుల దిగుమతులు బంద్:
పాకిస్తాన్‌లోని ఇంధన అవసరాల కోసం ప్రతిరోజూ ఇరాన్ నుంచి సుమారు 7,000 మెట్రిక్ టన్నుల మేర ఎల్పీజీ దిగుమతి అవుతుంది. అయితే అక్టోబర్ 17 నుంచి గబ్ద-రిందన్, తఫ్తాన్ సరిహద్దు మార్గాలను ఇరాన్ అధికారులు మూసివేశారు. భద్రతా తనిఖీలు, స్మగ్లింగ్ అడ్డుకట్ట పేరిట ఈ చర్యలు చేపట్టడంతో వందలాది గ్యాస్ ట్యాంకర్లు సరిహద్దుల వద్దే నిలిచిపోయాయి. దీనికితోడు పాకిస్తాన్ సైన్యాధికారులు, ఇరాన్ దౌత్యవేత్తల మధ్య టెహ్రాన్ వేదికగా చర్చలు జరుగుతున్నప్పటికీ, రవాణా ఇంకా పునరుద్ధరణ కాలేదు.

చలికాలం వేళ సామాన్యుల అవస్థలు:
చలికాలం ప్రారంభ దశలోనే దేశంలో పైప్‌లైన్ గ్యాస్ సరఫరా పడిపోవడంతో ప్రజలు పూర్తిగా ఎల్పీజీ సిలిండర్లపైనే ఆధారపడుతున్నారు. సరిహద్దు మూసివేతతో పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్, పంజాబ్, సింధ్ ప్రావిన్సుల్లో తీవ్ర గ్యాస్ కొరత ఏర్పడిందని పాకిస్తాన్ ఎల్పీజీ అసోసియేషన్ ఛైర్మన్ ఇర్ఫాన్ ఖోఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. బ్లాక్ మార్కెట్ వ్యాపారులు అందినకాడికి దోచుకుంటున్నారని, హోటళ్లు, రవాణా రంగంపై కూడా దీని ప్రభావం పడి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని సామాన్యులు వాపోతున్నారు.