బంగాళాఖాతంలో వాయుగుండం: అక్టోబర్ 28న ఏపీ తీరం దాటే తుపాను.. 9 పోర్టుల్లో ఒకటో నంబర్ హెచ్చరిక!
సూర్య వెదర్ బ్యూరో, చెన్నై/విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మరింత బలపడి తీవ్ర తుపానుగా మారే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం, ఈ వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర తుపానుగా రూపాంతరం చెంది, అక్టోబర్ 28 నాటికి బాపట్ల-విశాఖపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తీరప్రాంత యంత్రాంగం అప్రమత్తమైంది. సముద్రంలో ఎదురయ్యే ముప్పును ముందస్తుగా హెచ్చరిస్తూ తమిళనాడు, పుదుచ్చేరి పరిధిలోని 9 ప్రధాన ఓడరేవులలో అధికారులు ఒకటో నంబర్ దూరపు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు.