తాగునీటి పైప్‌లైన్‌కు యుద్ధపాతిపదికన మరమ్మతులు
వెల్దుర్తి (సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్):పట్టణంలోని రాములకోటకు వెళ్లే మార్గంలో బ్రహ్మగుండం నుంచి వచ్చే తాగునీటి ప్రధాన పైప్‌లైన్ (సిమెంట్ ఏసీ పైప్) తీవ్రంగా దెబ్బతినడం, పగిలిపోవడంతో వెల్దుర్తి పట్టణ ప్రజలకు నీటి సరఫరా నిలిచిపోయింది. దీనితో ప్రజలు ఎదుర్కొంటున్న నీటి ఎద్దడిని గుర్తించి అధికారులు, సిబ్బంది వెంటనే స్పందించి యుద్ధపాతిపదికన మరమ్మతు చర్యలు చేపట్టారు.జేసీబీ సహాయంతో తవ్వకాలు జరిపి, పగిలిపోయిన పాత పైప్‌లైన్‌ను తొలగించారు. అనంతరం కర్నూలు నుంచి ప్రత్యేకంగా తెప్పించిన 5 ఇంచుల నూతన వాల్‌ను అమర్చే పనులను వేగవంతం చేశారు.అలాగే పట్టణంలోని ఎల్లానాగిరెడ్డి ఇంటి వద్ద ఉన్న 3 ఇంచుల వాల్ పూర్తిగా పాడైపోవడంతో, దాని స్థానంలో కూడా నూతన 3 ఇంచుల వాల్‌ను అమర్చడం జరిగింది. ఈ మరమ్మతు పనులు పూర్తి కావడంతో త్వరలోనే పట్టణ వాసులకు తాగునీటి సరఫరా పునరుద్ధరణ కానుంది. సూర్య ప్రతినిధి షేక్ దస్తు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం