రాజుపేటలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన
కౌడిపల్లి;కౌడిపల్లి మండల పరిధిలోని రాజుపేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బాంచ దుర్గమ్మ నాగభూషణం ముఖ్య అతిథిగా హాజరై, భూమిపూజ చేసి నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ బాంచ దుర్గమ్మ నాగభూషణం మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్క పేద కుటుంబానికి సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం వేగవంతంగా అమలవుతోందని తెలిపారు. నిర్ణీత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ నిర్మలతో పాటు గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.