BREAKING
నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు ప్రచారంలో పాల్గొన్నవిప్ నాయకర్

ఘనంగా కొమరం భీమ్ జయంతి వేడుకలు

Select Suryaa Now
ఘనంగా కొమరం భీమ్ జయంతి వేడుకలు

గోకవరం, మేజర్ న్యూస్ :తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం తంటికొండ రోడ్డులోని సీఎండీ కార్యాలయం వద్ద విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,  జగ్గంపేట నియోజకవర్గం బీఎల్ఏ-1 కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన వీరయోధుడు కొమరం భీమ్ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. కొమరం భీమ్ చిత్రపటానికి కంబాల శ్రీనివాసరావు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ జల్‌–జంగల్‌–జమీన్‌ నినాదంతో ఆదివాసీల హక్కుల సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన విప్లవ వీరుడు, గిరిజన పోరాట యోధుడు కొమరం భీమ్ అన్నారు. నిజాం పాలనలో గిరిజనులు ఎదుర్కొన్న అన్యాయాలు, అణచివేతలకు వ్యతిరేకంగా పోరాడిన కొమరం భీమ్‌ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.