BREAKING
నీటి పన్ను వసూళ్లు వేగవంతం చేయాలి..... చిరుత సంచారం పై అప్రమత్తంగా ఉండండి. అడవి శాఖ అధికారి మల్లికార్జున. బాసర ఐఐఐటీ విద్యార్థులకు నిరంతరం సురక్షిత తాగునీరు అందించాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా నెల్లిమర్లలో వామపక్షాల నిరసన * ఎస్ఈసీ రాజీనామాకు డిమాండ్ * సూపర్ హీరోగా శ్రీకాంత్ తనయుడు రోషన్ మెకా.. గ్రాండ్‌గా కొత్త చిత్రం ప్రారంభం! రైతులు రైతు గుర్తింపు కార్డులో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి విద్య ద్వారానే అభివృద్ధి * ప్రధానోపాధ్యాయులు డాక్టర్ జె సి రాజ్ * యాదవుల వీరత్వానికి ప్రతీక సదర్ సమ్మేళనం రామతీర్థం శ్రీరామస్వామి ఆలయ హుండీల ఆదాయం రూ.21,89,335 ఉన్నత విద్యావంతుడు సర్పంచ్ అయితే గ్రామ రూపురేఖలు మారుతాయి! గ్రామాభివృద్ధి, అవినీతి రహిత పాలనే లక్ష్యంగా వీరవల్లి శివరామకృష్ణ ఎం.టెక్‌, ఎఫ్‌.ఐ.ఈ., న్యాయశాస్త్రంలో పీజీ పట్టా.. ప్రస్తుతం న్యాయశాస్త్రంలో పీహెచ్‌డీ పరిశోధన రూ.60 లక్షలతో నిర్మించిన మల్టీపర్పస్ సెంటర్‌ను ప్రారంభించిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్ కరువు పరిస్థితుల్లో రైతు కుటుంబాలను వేధించడం సరికాదు - మాజీ మంత్రి జోగు రామన్న. నూతన దుర్గాభవాని ఫర్టిలైజర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గోడపత్రిక విడుదల ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగుల సమస్యలపై జిల్లా కలెక్టర్ కలిసిన ఏపీ జెఎసి చైర్మన్ ఎస్ సురేష్ బాబు

ప్రజాస్వామ్య పరిరక్షణే భారత్ సమ్మిట్-2 ప్రధాన అజెండా: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Select Suryaa Now
ప్రజాస్వామ్య పరిరక్షణే భారత్ సమ్మిట్-2 ప్రధాన అజెండా: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సూర్య, తెలంగాణ, బ్యూరో ప్రతినిధి: ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య విలువలు, అహింస, స్వేచ్ఛ, సమానత్వాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్-2 నిర్వహిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. దావోస్ అంతర్జాతీయ వేదికగా ప్రపంచ ఆర్థిక, పెట్టుబడుల విధానాలపై చర్చలకు గుర్తింపు పొందినట్లే.. రాజకీయ, సామాజిక, ఆర్థిక విధానాలపై ప్రపంచానికి దిశానిర్దేశం చేసే వేదికగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈనెల 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో భారత్ సమ్మిట్-2026 జరగనుందని చెప్పారు.
నోవాటెల్ హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యవాదులు, ఉదారవాదులు, ప్రగతిశీల భావాలు కలిగినవారిని ఒకే వేదికపైకి తీసుకొస్తోందన్నారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు 70కిపైగా దేశాల నుంచి 1,000 మందికి పైగా ప్రజాప్రతినిధులు, విధాన నిర్ణేతలు, మేధావులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరుకానున్నారని వెల్లడించారు.
ప్రపంచానికి గాంధీ, నెహ్రూ విధానాలే మార్గదర్శకం
మహాత్మా గాంధీ బోధించిన అహింసా సిద్ధాంతం, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అనుసరించిన అలీన విదేశాంగ విధానం, మిశ్రమ ఆర్థిక విధానాలు నేటి ప్రపంచానికి ఎంతో అవసరమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అగ్రరాజ్యాల ఒత్తిళ్లకు తలొగ్గకుండా అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ స్వతంత్ర గుర్తింపును, అస్తిత్వాన్ని కాపాడుకోవాలన్నదే నెహ్రూ ఆశయమని చెప్పారు. పంచవర్ష ప్రణాళికలు, ఆర్థిక విధానాల ద్వారా దేశ అభివృద్ధికి నెహ్రూ బలమైన పునాదులు వేశారని గుర్తుచేశారు.
ప్రతిపక్షాలను శత్రువులుగా చూడటం ప్రజాస్వామ్య విరుద్ధం
పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా కీలకమని భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాన ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా చూడటం, వారి రాజకీయ ఉనికిని దెబ్బతీయాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకు విరుద్ధమన్నారు. ప్రతిపక్షాల విధానాలను వ్యతిరేకించవచ్చే తప్ప, వాటి నాయకులను శత్రువులుగా పరిగణించకూడదని స్పష్టం చేశారు. ఈ అంశాలపై చర్చించేందుకు అన్ని రాజకీయ పార్టీలను, నాయకులను భారత్ సమ్మిట్‌కు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడాలి
ఎన్నికల్లో ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత కీలకమైన హక్కు అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియ పేరుతో అర్హులైన ఓటర్ల హక్కులను తొలగించే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందన్నారు. రాహుల్ గాంధీ నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పరిరక్షణ కోసం పోరాడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల కోసమే కాకుండా ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఎదుర్కొంటున్న దేశంలోని ప్రతి పౌరుడి తరఫున తమ పార్టీ నిలబడుతోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ఎన్నికల సంఘం, ప్రభుత్వాల బాధ్యత కావాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ అడ్మినిస్ట్రేషన్ ఇన్‌ఛార్జి గురుదీప్ సింగ్ సప్పల్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, సమృద్ధ భారత్ ఫౌండేషన్ డైరెక్టర్ పుష్పరాజ్ దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు.
ఎ.రవీందర్‌, హైదరాబాద్‌.