ప్రధాని మోదీ సమక్షంలో కళా ప్రదర్శనకు అవకాశం
కొడంగల్, మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం చిట్లపల్లి గ్రామానికి చెందిన జానపద కళాకారుడు ప్రకాష్ ముదిరాజ్‌కు జాతీయ స్థాయిలో అవకాశం లభించింది. అక్టోబర్ 31న గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో నిర్వహించనున్న జాతీయ ఏక్తా దివస్ వేడుకల్లో తెలంగాణ తరఫున కల్చరల్ టీమ్ లీడర్‌గా, కొరియోగ్రఫీ బృందంలో 10 రోజుల పాటు సేవలందించనున్నారు. ఈ అవకాశం తెలంగాణ కళావైభవాన్ని జాతీయ స్థాయిలో చాటిచెప్పడంతో పాటు కొడంగల్ ప్రాంతానికి గర్వకారణంగా నిలిచింది.
రిపోర్టర్: ఆబీద్, కొడంగల్, వికారాబాద్ జిల్లా