పోలీసుల విధులు బాధ్యతలపై విద్యార్థులకు అవగాహన
- సీఐ వెంకటేశ్వర్లు
ఆమనగల్లు రంగారెడ్డి:
పోలీస్అమరవీరుల దినోత్సవం ను పురస్కరించుకొని మంగళవారం పట్టణంలోని అరబిందో హై స్కూల్ విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. పోలీసులు, విధులు, బాధ్యతలు, ప్రజలకు అందించే సేవలు, చట్టాలపై స్థానిక పోలీస్ స్టేషన్లో అవగాహన కల్పించారు. పోలీస్ ఫ్లాగ్ డే వీక్ 2026లో భాగంగా ఆమనగల్లు లో సిఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం లో భాగంగా అక్టోబర్ 21 నుండి 31 వరకు నిర్వహిస్తున్నవారోత్సవాలతో పాటు, పోలీస్ ఫ్లాగ్ డే వీక్ 2026లో భాగంగా విద్యార్థులకుఈ సందర్భంగా నిర్వహించినఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్లో అరబిందో హైస్కూల్ విద్యార్థుల కు పోలీసుల విధులు, బాధ్యతలు, ప్రజలకు అందించే సేవలు, చట్టాలపైఅవగాహనకల్పించారు.పోలీసుల పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కల్పిస్తూ, పోలీసులకు ప్రజలకు మధ్య సత్సంబంధాలనుబలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని సీఐ పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థలో ప్రజల పాత్ర, ప్రజలకు పోలీసుల నుంచి ఉండే అంచనాలు,సామాజిక మాధ్యమాల సద్వినియోగం వంటి అంశాలపై సిబ్బందిలో అవగాహనపెంపొందించేందుకు పోటీలు దోహదం చేస్తాయని ఆయనఅన్నారు. విద్యార్థులకు సైబర్ నేరాల నివారణలో పౌరులు పోలీసుల పాత్ర , విద్యార్థుల్లో చట్టాల పట్ల గౌరవం, సామాజిక బాధ్యత, సమాజంలో పోలీసుల పట్ల అవగాహనపెంపొందించడమే పోలీసు లక్ష్యమని చెప్పారు.సామాజికమాధ్యమాలదుర్వినియోగాన్నిఅరికట్టడంలో పోలీసుల పాత్ర, సామాజికమాధ్యమాలనుబాధ్యతాయుతంగావినియోగించడం, తెలంగాణ రాష్ట్రాన్ని మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో యువత పాత్ర వంటి అంశాలపై అవగాహన కల్పించినట్లు సిఐ పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల ద్వారా విద్యార్థులు, యువత, పోలీసు సిబ్బందిలో సామాజికబాధ్యతనుపెంపొందించడం, సైబర్ నేరాలు మాదకద్రవ్యాలపైఅవగాహన కల్పించడం, సామాజిక మాధ్యమాలసద్వినియోగాన్ని ప్రోత్సహించడం, పోలీసులకు, ప్రజలకు మధ్య పరస్పర నమ్మకాన్ని బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు.ప్రజల సహకారంతో సురక్షితమైన సమాజాన్ని నిర్మించేందుకు, నేర రహిత, మాదకద్రవ్య రహిత తెలంగాణ సాధనకు అమనగల్లు పోలీసులు కట్టుబడి ఉన్నారని అందుకు ప్రజల సంపూర్ణ సహకారం అందించాలని ఆయన కోరారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు పట్టణంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువకులు స్వచ్ఛందంగా పాల్గొని తమ రక్తాన్ని దానం చేసి శిబిరాన్ని విజయవంతం చేయాలని సీఐ వెంకటేశ్వర్లు కోరారు.కార్యక్రమంలో ఎస్సై సంతోష్ రెడ్డి, ఏఎస్ఐ రామ్ రెడ్డి,విద్యార్థులు, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
ఎ. చంద్రశేఖర్, మేజర్ న్యూస్.