పోలీసుల విధులపై విద్యార్థులకు అవగాహన
సూర్య మంచిర్యాల టౌన్ : పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో షీ టీమ్స్ సహకారంతో విద్యార్థులకు ‘ఓపెన్ హౌస్’ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీసుల విధులు,బాధ్యతలు, శాంతిభద్రతల పరిరక్షణ, మహిళలు, చిన్నారుల రక్షణలో పోలీస్ శాఖ పాత్రపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.గుడ్ టచ్–బ్యాడ్ టచ్ గురించి వివరించి,ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే భయపడకుండా తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.పోలీస్ శాఖలో ఉపయోగించే కమ్యూనికేషన్ పరికరాలు, నేరాల దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం గురించి వివరించారు.పోలీస్ వ్యవస్థ పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకునేలా చేయడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఎస్‌ఐ ఉషారాణి, మహిళా పోలీస్ స్టేషన్, షీ టీమ్స్ సిబ్బంది పాల్గొన్నారు.