తెలుగుదేశం జడ్పీటీసీ అభ్యర్థులకు బీ ఫారాల పంపిణీ
నెల్లూరు, మేజర్ న్యూస్ : కూటమి నాయకులు, కార్యకర్తలతో సమన్వయంతో సాగుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని కోవూరు శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సూచించారు. నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ బీద రవిచంద్ర అధ్యక్షతన మంగళవారం జడ్పీటీసీ అభ్యర్థుల బీ ఫారాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. జడ్పీటీసీ స్థానాలకు బరిలో నిలిచిన అభ్యర్థులకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తో కలిసి బీ ఫారాలు అందజేశారు. కూటమి ప్రభుత్వం గడిచిన రెండున్నరేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని వర్గాల మద్దతు కూడగట్టాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సూచించారు. కూటమి నాయకులు, కార్యకర్తలను కలుపుకొని ముందుకు సాగాలన్నారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.